Xiaomi 3.1SoundBar: అధరగొట్టే సౌండ్ మరియు Dolby&DTS సౌండ్ టెక్నాలజీతో వచ్చింది

Updated on 17-Nov-2021
HIGHLIGHTS

Xiaomi లేటెస్ట్ గా 3.1 ఛానల్ SoundBar ను ఆవిష్కరించింది

హెవీ సౌండ్ మరియు సబ్ ఉఫర్ తో తీసుకొచ్చింది

Dolby Audio మరియు DTS డ్యూయల్ డీకోడింగ్ టెక్నాలజీ ఇందులో అందించినట్లు కంపెనీ చెబుతోంది

Xiaomi లేటెస్ట్ గా 3.1 ఛానల్ SoundBar ను ఆవిష్కరించింది.  2019 లో తీసుకొచ్చిన సింగిల్ సౌండ్ బార్ మాదిరిగా కాకుండా, ఈ సౌండ్ బార్ ను హెవీ సౌండ్ మరియు సబ్ ఉఫర్ తో తీసుకొచ్చింది. కేవలం ఇది మాత్రమేకాదు, Dolby Audio, DTS డిజిటల్ సరౌండ్ మరియు DTS: Virtual X వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఈ సౌండ్ బార్ ను ప్రకటించింది. లేటెస్ట్ గా షియోమి తీసుకొచ్చిన ఈ సౌండ్ బార్ గురించి కంప్లీట్ గా తెలుసుకోండి.

Xiaomi 3.1SoundBar:

షియోమి ఈ Xiaomi 3.1SoundBar ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సౌండ్ బార్ ను వైర్ లెస్ యాక్టివ్ సబ్ ఉఫర్ తో జతగా అందించింది. ఈ సౌండ్ బార్ టోటల్ 430W అవుట్ పుట్ తో ఉంటుంది. అయితే, ఇందులో ఉఫర్ మరియు బార్ కెపాసిటీలు విడి విడిగా ఎంత ఉంటాయనే విషయాన్ని మాత్రమే వివరించలేదు. కానీ, బార్ లో 3 ఫుల్ రేంజ్ స్పీకర్లు, 3 ట్వీటర్లు మరియు హెవీ బేస్ కోసం 6.5 ఇంచ్ ఉఫర్ ఉన్నట్లు వెల్లడించింది.

ఈ ఉఫర్ ఎటువంటి వైర్ అవసరం లేకుండా వైర్ లెస్ కనెక్షన్ తో వస్తుంది మరియు డౌన్ ఫైరింగ్ సబ్ ఉఫర్. ఇది Music, Film, News మరియు Game వంటి నాలుగు Modes తో వస్తుంది. ఇక మైన్ సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఇది సమర్ధవంతమైన మరియు పర్ఫెక్ట్ సినిమా అనుభవాన్ని అందించడానికి వీలుగా Dolby Audio మరియు DTS డ్యూయల్ డీకోడింగ్ టెక్నాలజీ ఇందులో అందించినట్లు కంపెనీ చెబుతోంది.

కానీ, ఈ  Xiaomi 3.1SoundBar మార్కెట్లోకి ఎప్పటి వరకూ వస్తుంది మరియు దీని ధర ఎంత అనే విషయాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. Xiaomi భారతదేశంలో ఈ సౌండ్ బార్ ను విడుదల చేస్తుందో లేదో అనికూడా స్పష్టంగా తెలియలేదు.                                

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :