వాయిస్ ఛేజింగ్ మైక్ తో కొత్త బ్లూటూత్ స్పీకర్ లాంచ్ చేసిన Unix బ్రాండ్.!

Updated on 20-Nov-2024

Unix బ్రాండ్ నుంచి కొత్త బ్లూటూత్ స్పీకర్ లాంచ్ అయ్యింది. కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసేలా ఈ కొత్త బ్లూటూత్ స్పీకర్ ను లాంచ్ చేసింది. అదెలా అనుకుంటున్నారా? యునిక్స్ కొత్త స్పీకర్ ను వాయిస్ చేంజ్ చేసే మైక్ తో జతగా అందించింది. అందుకే, ఈ స్పీకర్ కొత్త ట్రెండ్ సెట్ చేసేలా ఉందని చెబుతోంది. యునిక్స్ కొత్తగా లాంచ్ చేసిన ఈ కొత్త బ్లూటూత్ స్పీకర్ విశేషాలు తెలుసుకోండి.

Unix కొత్త స్పీకర్ : ఫీచర్స్ & ప్రైస్

యునిక్స్ ఈ కొత్త స్పీకర్ ను చాలా కాంపాక్ట్ సైజులో ఆకట్టుకునే ఫీచర్స్ మరియు కలర్ లలో అందించింది. ఈ కొత్త బ్లూటూత్ స్పీకర్ ను వాయిస్ ఛేంజింగ్ ఫీచర్ మరియు మైక్ తో అందించింది. అంటే, ఈ మైక్ తో వాయిస్ ను మార్చి వినిపించే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ తో ఈ స్పీకర్ అన్నింటిలో ప్రత్యేకంగా కనిపించేలా యునిక్స్ చేసింది.

ఈ స్పీకర్ ని కేవలం రూ. 899 ఋఒప్యాల ధరలో విడుదల చేసింది మరియు ఇది Unix వెబ్సైట్ తో పాటు అన్ని ప్రధాన రిటైల్ షాపుల్లో లభిస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ వైట్, బ్లాక్ మరియు పింక్ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

ఇరాక్ యునిక్స్ లాంచ్ చేసిన ఈ కొత్త బ్లూటూత్ స్పీకర్ విషయానికి వస్తే, ఈ స్పీకర్ 1200mAh బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు 6 గంటల ప్లే టైం అందిస్తుంది. ఇది టైప్ C ఛార్జింగ్ పోర్ట్ తో వస్తుంది మరియు ప్రీమియం ABS మరియు ఫ్యాబ్రిక్ మెటీరియల్ తో తయారు చేయబడింది.

Also Read: Instagram Down: వీడియో అప్లోడ్ తో పాటు మరిన్ని ఫీచర్స్ ఇన్స్టాగ్రామ్ లో పనిచేయడం లేదట.!

ఈ యునిక్స్ కొత్త బ్లూ టూత్ స్పీకర్ లెట్స్ 5.3 సపోర్ట్ తో వస్తుంది మరియు బిల్ట్ ఇన్ మైక్రో ఫోన్ ను కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :