Boat Rockerz series నుండి రెండు కొత్త హెడ్ ఫోన్స్ లాంచ్

Boat Rockerz series నుండి రెండు కొత్త హెడ్ ఫోన్స్ లాంచ్
HIGHLIGHTS

మంచి HD సౌండ్ క్వాలిటీతో ఆడియోను అందిచే హెడ్ ఫోన్లకు పేరుగాంచిన ఈ Rockerz series లో మరొక రెండు కొత్త హెడ్ ఫోన్లను జతచేసినట్లు బోట్ తెలిపింది.

ఈ రెండు హెడ్ ఫోన్లను, Rockerz 450 మరియు Rockerz 640 మోడల్ పేరుతొ మార్కెట్లోకి విడుదల చేసినట్లు సంస్థ ప్రకటించింది.

ఈ బోట్ రాకర్జ్ సిరీస్ హెడ్ ఫోన్లు ప్రస్తుతం జనరేషన్ వారికీ రోజువారీ ఉపయోగానికి తగినట్లుగా ఉంటాయి.

బోట్ Rockerz series నుండి రెండు కొత్త  హెడ్ ఫోన్లను విడుదల చేసింది. మంచి HD సౌండ్ క్వాలిటీతో ఆడియోను అందిచే హెడ్ ఫోన్లకు పేరుగాంచిన ఈ Rockerz series లో మరొక రెండు కొత్త హెడ్ ఫోన్లను జతచేసినట్లు బోట్ తెలిపింది. ఈ రెండు హెడ్ ఫోన్లను, Rockerz 450 మరియు Rockerz 640 మోడల్ పేరుతొ మార్కెట్లోకి విడుదల చేసినట్లు సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా, బ్లూటూత్ కనెక్టవిటీతో వచ్చే ఈ హై క్వాలిటీ హెడ్ ఫోన్లను, ఈ విభాగంలో తక్కువ ధరతో అందించినట్లు కూడా తెలుపుతోంది.

బోట్ యొక్క బిజినెస్ హెడ్ అయినటువంటి, అంకుష్ గుగ్లానీ వీటిగురించి మాట్లాడుతూ " ఈ బోట్ రాకర్జ్ సిరీస్ హెడ్ ఫోన్లు ప్రస్తుతం జనరేషన్ వారికీ రోజువారీ ఉపయోగానికి తగినట్లుగా ఉంటాయి. ఇవి ఫ్యాషన్ తో పాటుగా ఫంక్షనలుగా కూడా ఉంటాయి. ముఖ్యంగా, ఇప్పుడు విడుదల చేసిన ఈ Rockerz 450 మరియు Rockerz 640 హెడ్ ఫోన్లతో, వినియోగదారులు ఒక అద్భుతమైన మ్యూజిక్ అనుభూతిని పొందుతారు" అని పేర్కొన్నారు.

Boat హెడ్ ఫోన్ల ధరలు  మరియు ప్రత్యేకతలు

Rockerz 450 ధర – Rs . 1,799

Rockerz 650 ధర – Rs . 2,999

ఈ హెడ్ ఫోన్లు ఒక్క సరి ఛార్జ్ చేస్తే, 8 గంటల వరకు నిరంతరాయంగా మ్యూజిక్ ఎంజాయ్ చెయ్యవచు. ఇవి పెద్ద 40mm డ్రైవర్స్ తో వస్తాయి కాబట్టి డీప్ బాస్ ని మరియు ఇందులో అందించిన 20hz -20khz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వలన చాల లోతైన ధ్వనులను కూడా చక్కగా వినవచ్చు. ఇవి బ్లూటూత్ వెర్షన్ 4.2 పైన పనిచేస్తాయి. ఇవి 10 మీటర్ల వరకు వైర్లెస్ గా వాడుకోవచ్చు. వీటిలో అందించిన, 300mAh బ్యాటరీ మంచి లాంగ్ లైఫ్ తో వస్తుంది. అధనంగా, ఒక 3.5 జాక్ పిన్ కూడా అందించడింది కాబట్టి వైరుతో కూడా అనుసంధానం చేసుకోవచ్చు. ఈ రెండు హెడ్ ఫోన్ల పైన 1 సంవత్సరం వారెంటీని కూడా అందిస్తోంది. ఈ ఈ రెండు హెడ్ ఫోన్లను కూడా అమేజాన్ ఇండియాలో అందుబాటులో ఉంచింది.                          

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo