ప్రముఖ ఆడియో ప్రోడక్ట్స్ బ్రాండ్ Sennheiser కొత్త సౌండ్ బార్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ముందుగా వచ్చిన AMBEO సౌండ్ బార్ నెక్స్ట్ జెనరేషన్ సౌండ్ బార్ గా ఇది లాంచ్ అయ్యింది. సెన్ హైజర్ ఈ సౌండ్ బార్ ను పేరుతో Sennheiser AMBEO Soundbar Plus పేరుతో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ సౌండ్ బార్ కంఫర్ట్ కలిగిన సన్నని డిజైన్ లో చాలా పవర్ ఫుల్ మరియు యాక్యురిట్ సౌండ్ అందించ గల సత్తా కలిగి ఉందని కంపెనీ గొప్పగా చెబుతోంది. సెన్ హైజర్ ఇండియాలో విడుదల చేసిన ఈ సరికొత్త సౌండ్ బార్ వివరాలు మరియు విశేషాలు ఏమిటో తెలుసుకుందాం పదండి.
ఈ సౌండ్ బార్ సబ్ ఉఫర్ లేకుండా కేవలం బార్ తో మాత్రమే వస్తుంది. కానీ, ఇందులో అందించిన ప్రీమియం స్పీకర్లతో అత్యద్భుతమైన ప్రీమియం సౌండ్ అందిస్తుందని సెన్ హైజర్ తెలిపింది. ఈ సౌండ్ బార్ లో రెండు 4 ఇంచ్ Cellulose Cone స్పీకర్లు మరియు 2 ఇంచ్ సైజు కలిగిన 7 అల్యూమినియం కోన్ ఫుల్ రేంజ్ స్పీకర్లు ఉన్నాయి. ఈ సౌండ్ బార్ 38Hz – 20 Khz ఫ్రీక్వెన్సీ రేంజ్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 7.1.4 ఛానెల్ సౌండ్ బార్ మరియు నేచురల్ అండ్ పవర్ ఫుల్ సౌండ్ ప్రొడ్యూజ్ చెయ్యగలదు.
కనక్టివిటీ పరంగా, S/PDIF, 1 Stereo RCA సాకెట్, 1 USB, ఒక Mono RCA, 1 HDMI eARC (HDMI 2.1) మరియు 2x HDMI 2.0a పోర్ట్ లను ఈ సౌండ్ బార్ కలిగి వుంది. ఇందులో Sub Woofer అవుట్ పుట్ మరియు 4 బిల్ట్ ఇన్ ఫార్ ఫీల్డ్ స్పీకర్లు ను కూడా సెన్ హైజర్ అందించింది.
ఇక సౌండ్ మరియు సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ టోటల్ 400W(RMS) సౌండ్ అందిస్తుంది. ఈ బార్ Dolby Atmos, dtsX, MPEG-H ఆడియో మరియు 360 రియాలిటీ ఆడియో సపోర్ట్ లను కలిగి వుంది. ఎటువంటి సౌండ్ అయినా ఈ సౌండ్ బార్ నాచురల్ మరియు యూనిక్ గా అందిస్తుందని కంపెనీ గొప్పగా చెబుతోంది.
ఈ సౌండ్ బార్ ధర విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ ను రూ. 1,39,990 ధరతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది.