7.1.4 ఛానెల్ సౌండ్ బార్ లాంచ్ చేసిన Sennheiser..ఫీచర్లు మాములుగా లేవు.!

7.1.4 ఛానెల్ సౌండ్ బార్ లాంచ్ చేసిన Sennheiser..ఫీచర్లు మాములుగా లేవు.!
HIGHLIGHTS

Sennheiser కొత్త సౌండ్ బార్ ను ఇండియాలో లాంచ్ చేసింది

Sennheiser AMBEO Soundbar Plus పేరుతో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది

ఈ సౌండ్ బార్ 7.1.4 ఛానెల్ సౌండ్ బార్ మరియు నేచురల్ అండ్ పవర్ ఫుల్ సౌండ్ ప్రొడ్యూజ్ చెయ్యగలదు.

ప్రముఖ ఆడియో ప్రోడక్ట్స్ బ్రాండ్ Sennheiser కొత్త సౌండ్ బార్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ముందుగా వచ్చిన AMBEO సౌండ్ బార్ నెక్స్ట్ జెనరేషన్ సౌండ్ బార్ గా ఇది లాంచ్ అయ్యింది. సెన్ హైజర్ ఈ సౌండ్ బార్ ను పేరుతో Sennheiser AMBEO Soundbar Plus పేరుతో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ సౌండ్ బార్ కంఫర్ట్ కలిగిన సన్నని డిజైన్ లో చాలా పవర్ ఫుల్ మరియు యాక్యురిట్ సౌండ్ అందించ గల సత్తా కలిగి ఉందని కంపెనీ గొప్పగా చెబుతోంది. సెన్ హైజర్ ఇండియాలో విడుదల చేసిన ఈ సరికొత్త సౌండ్ బార్ వివరాలు మరియు విశేషాలు ఏమిటో తెలుసుకుందాం పదండి. 

Sennheiser AMBEO Soundbar Plus:

ఈ సౌండ్ బార్ సబ్ ఉఫర్ లేకుండా కేవలం బార్ తో మాత్రమే వస్తుంది. కానీ, ఇందులో అందించిన ప్రీమియం స్పీకర్లతో అత్యద్భుతమైన ప్రీమియం సౌండ్ అందిస్తుందని సెన్ హైజర్ తెలిపింది. ఈ సౌండ్ బార్ లో రెండు 4 ఇంచ్ Cellulose Cone స్పీకర్లు మరియు 2 ఇంచ్ సైజు కలిగిన 7 అల్యూమినియం కోన్ ఫుల్ రేంజ్ స్పీకర్లు ఉన్నాయి. ఈ సౌండ్ బార్ 38Hz – 20 Khz ఫ్రీక్వెన్సీ రేంజ్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 7.1.4 ఛానెల్ సౌండ్ బార్ మరియు నేచురల్ అండ్ పవర్ ఫుల్ సౌండ్ ప్రొడ్యూజ్ చెయ్యగలదు.

Sennheiser AMBEO Soundbar Plus.jpg

కనక్టివిటీ పరంగా, S/PDIF, 1 Stereo RCA సాకెట్, 1 USB, ఒక Mono RCA, 1 HDMI eARC (HDMI 2.1) మరియు 2x HDMI 2.0a పోర్ట్ లను ఈ సౌండ్ బార్ కలిగి వుంది. ఇందులో Sub Woofer అవుట్ పుట్ మరియు 4 బిల్ట్ ఇన్ ఫార్ ఫీల్డ్ స్పీకర్లు ను కూడా సెన్ హైజర్ అందించింది. 

ఇక సౌండ్ మరియు సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ టోటల్ 400W(RMS) సౌండ్ అందిస్తుంది. ఈ బార్ Dolby Atmos, dtsX, MPEG-H ఆడియో మరియు 360 రియాలిటీ ఆడియో సపోర్ట్ లను కలిగి వుంది. ఎటువంటి సౌండ్ అయినా ఈ సౌండ్ బార్  నాచురల్ మరియు యూనిక్ గా అందిస్తుందని కంపెనీ గొప్పగా చెబుతోంది. 

ఈ సౌండ్ బార్ ధర విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ ను రూ. 1,39,990 ధరతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo