Samsung Music Frame Speaker ను ఇండియాలో కూడా పరిచయం చేయబోతున్న శామ్సంగ్.!
Samsung Music Frame Speaker ను ఇండియాలో కూడా పరిచయం చేయబోతున్న శామ్సంగ్
ఇది పవర్ ఫుల్ సౌండ్ మరియు కనెక్టివిటీ ఫీచర్ లతో అదరగొడుతుంది
శామ్సంగ్ మ్యూజిక్ ఫ్రేమ్ టీజర్ పేజ్ ను అమెజాన్ అందించింది
Samsung Music Frame Speaker ను ఇండియాలో కూడా పరిచయం చేయబోతున్నట్లు శామ్సంగ్ ప్రకటించింది. ముందుగా US మార్కెట్ లో పరిచయం చేయబడిన ఈ ప్రోడక్ట్ ఇప్పుడు భారత మార్కెట్లోకి కూడా అడుగుపెడుతోంది. ఇది చూడటానికి సాధారణ ఫోటో ఫ్రేమ్ మాదిరిగా కనిపించినా, ఇది పవర్ ఫుల్ సౌండ్ మరియు కనెక్టివిటీ ఫీచర్ లతో అదరగొడుతుంది.
Samsung Music Frame Speaker
మ్యూజిక్ ఫ్రేమ్ స్పీకర్లను ఇండియాలో త్వరలో విడుదల చేస్తున్నట్లు శామ్సంగ్ తెలిపింది. ఈ మ్యూజిక్ ఫ్రేమ్ కోసం సేల్ పార్ట్నర్ గా అమెజాన్ వ్యవహరిస్తోంది. ఈ శామ్సంగ్ మ్యూజిక్ ఫ్రేమ్ టీజర్ పేజ్ ను అమెజాన్ అందించింది. ఈ పేజీ నుండి ఈ మ్యూజిక్ ఫ్రేమ్ ఫీచర్స్ తో Amazon ఆటపట్టిస్తోంది.
ఈ శామ్సంగ్ మ్యూజిక్ ఫ్రేమ్ స్పీకర్ చూడటానికి సాధారణ ఫ్రేమ్ మాదిరిగానే ఉంటుంది. ఇది కావాల్సిన విధంగా మార్చుకునేలా కస్టమ్ ఆప్షన్ లతో కూడా వస్తుంది. అయితే, ఇది వైర్లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫీచర్ తో అలరిస్తుంది. అంటే, ఈ మ్యూజిక్ ఫ్రేమ్ లో మీకు నచ్చిన పాటలను మీ ఫోన్ నుండి నేరుగా ప్లే చేయవచ్చు.
ఈ మ్యూజిక్ ఫ్రేమ్ ప్రత్యేకతలు ఇంతటితోనే అయిపోలేదు. ఈ మ్యూజిక్ ఫ్రేమ్ స్పీకర్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫ్రేమ్ స్పీకర్ లో ఉన్న హైక్వాలిటీ 3-Way స్టీరియో స్పీకర్ మరియు వైడ్ రేంజ్ స్పీకర్ టెక్నాలజీతో ఇది అద్భుతమైన సౌండ్ ను నలుమూలలా అందిస్తుంది. ఈ ఫ్రేమ్ ను టీవీ కూడా కనెక్ట్ చేసుకునే వీలుంది.
Also Read: రూ. 9,000 కంటే తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ 5G Mobile ఫోన్లు ఇవే గురూ.!
ఈ అప్ కమింగ్ శామ్సంగ్ ప్రోడక్ట్ ఇప్పటికే US మార్కెట్లో అందుబాటులో వుంది. ఈ ఫ్రేమ్ స్పీకర్ ను యుఎస్ మార్కెట్ లో $399.99 (సుమారు రూ. 34,000) ధరతో ప్రవేశపెట్టింది. అయితే, ఇండియన్ మార్కెట్ లో ఎటువంటి ధరతో ప్రవేశపెడుతుందో చూడాలి. ఎందుకంటే, ఇది ప్రీమియం ఫీచర్ లు కలిగిన ప్రీమియం ప్రోడక్ట్ అని చూడగానే చెప్పవచ్చు.
అయితే, మ్యూజిక్ ఫ్రేమ్ స్పీకర్ ప్రీమియం సౌండ్ అందిస్తుంది మరియు ఇంటిని అందంగా డెకరేట్ చేసేలా అందమైన లుక్ తో ఉంటుంది.