Redmi Buds 6: ఈ నెల 9వ తేదీ Redmi Note 14 Series అనౌన్స్ చేసిన షియోమీ అదే రోజు రెడ్ మీ బడ్స్ 6 ని కూడా లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను డ్యూయల్ స్పీకర్ సెటప్ టెక్నాలజీ తో సుపీరియర్ సౌండ్ అందించే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు షియోమీ టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ కీలకమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ పై ఒక లుక్కేద్దామా.
రెడ్ మీ బడ్స్ 6 బడ్స్ డిసెంబర్ 9వ తేదీ ఇండియాలో అవుతుంది. ఈ బడ్స్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, బడ్స్ కీలకమైన ఫీచర్స్ తో అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి తో టీజింగ్ చేస్తుంది.
రెడ్ మీ బడ్స్ 6 సెగ్మెంట్ ఫస్ట్ డ్యూయల్ డ్రైవర్ టెక్నాలజీ కలిగిన బడ్స్ గా కంపెనీ టీజింగ్ వెల్లడించింది. అంటే, ఈ ధరలో డ్యుయల్ స్పీకర్ (బాస్ స్పీకర్ + ట్వీటర్) కలిగిన బడ్స్ గా అభివర్ణించింది. అంటే, ఇది చవక ధరలో గొప్ప సౌండ్ అందించే బడ్స్ గా ఉంటాయని కంపెనీ చెప్పకనే చెబుతోంది.
ఈ అప్ కమింగ్ రెడ్మీ బడ్స్ యొక్క మరిన్ని ఇతర ఫీచర్లు కూడా కంపెనీ వెల్లడించింది. ఈ రెడ్ మీ బర్డ్స్ 49 dB నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫీచర్ తో బయట నుంచి వచ్చే 99.6% వెలుపలి నోయిస్ ను తగ్గిస్తుందని రెడ్ మీ సి చెబుతోంది.
Also Read: Phantom V Fold 2: గొప్ప ఫీచర్స్ తో మరొక కొత్త ఫోల్డ్ ఫోన్ ను లాంచ్ చేస్తున్న Tecno.!
ఈ బడ్స్ ను గొప్ప కాంపాక్ట్ డిజైన్ మరియు టైప్ C ఛార్జింగ్ పోర్ట్ తో తీసుకు వస్తోంది. ఇందులో సన్నని LED లైట్ వుంది మరియు ఇది ఫంక్షనల్ లైట్ గా ఉంటుంది. మంచి కాలింగ్ కోసం AI ENC సపోర్ట్ మరియు 43 గంటల ప్లే బ్యాక్ అందించే బిగ్ బ్యాటరీ తో ఈ బడ్స్ ను అందిస్తుంది. బడ్స్ 6 IP54 రేటింగ్ తో డస్ట్ ప్రూఫ్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది.