Redmi Buds 6: బడ్జెట్ ధరలో డ్యుయల్ స్పీకర్ ANC బడ్స్ లాంచ్ చేసిన షియోమీ.!

Redmi Buds 6: బడ్జెట్ ధరలో డ్యుయల్ స్పీకర్ ANC బడ్స్ లాంచ్ చేసిన షియోమీ.!
HIGHLIGHTS

Redmi Buds 6 బడ్స్ ను బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది

డ్యుయల్ స్పీకర్ మరియు హైబ్రిడ్ ANC వంటి ఆకర్షనీయమైన ఫీచర్స్ తో లాంచ్

12.4mm టైటానియం స్పీకర్ మరియు 5.5mm ట్వీటర్ తో అందించింది

Redmi Buds 6; షియోమీ ఈరోజు బిగ్ లైవ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ నుంచి రెడ్ మీ నోట్ 14 సిరీస్, బ్లూటూత్ స్పీకర్ మరియు బడ్స్ ను కూడా విడుదల చేసింది. ఈ ఈవెంట్ నుంచి రెడ్ మీ బడ్స్ 6 ని విడుదల చేసింది. ఈ కొత్త బడ్స్ ను బడ్జెట్ ధరలో డ్యుయల్ స్పీకర్ మరియు హైబ్రిడ్ ANC వంటి ఆకర్షనీయమైన ఫీచర్స్ తో అందించింది.

Redmi Buds 6: ధర

రెడ్ మీ బడ్స్ 6 ను కేవలం రూ. 2,999 ధరలో విడుదల చేసింది. అంతేకాదు, లాంఛ్ ఆఫర్ లో భాగంగా ఈ బడ్స్ ను రూ. 2,799 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చని కూడా షియోమీ తెలిపింది. ఈ బడ్స్ డిసెంబర్ 13 వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

ఈ బడ్స్ ను అమెజాన్ ఇండియా, mi.com మరియు mi స్టోరేజ్ నుంచి కొనుగోలు చెయవచ్చు.

Redmi Buds 6: ఫీచర్స్

రెడ్ మీ బడ్స్ 6 బడ్స్ ను డ్యూయల్ స్పీకర్ సెటప్ తో అందించింది. ఇందులో 12.4mm టైటానియం స్పీకర్ మరియు 5.5mm ట్వీటర్ తో అందించింది. ఈ బడ్స్ డ్యూయల్ డివైజ్ షేరింగ్ మరియు 5 కస్టమ్ సౌండ్ ప్రొఫైల్స్ సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ 360 స్పెటియల్ సౌండ్ అందిస్తుంది.

Redmi Buds 6

ఈ కొత్త రెడ్ మీ బడ్స్ ను బ్యాగ్రౌండ్ నోయిస్ ను 99.6% బ్లాక్ చేసే 49dB హైబ్రిడ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ను కలిగి వుంది. అలాగే, ఈ బడ్స్ రెగ్యులర్, ఎన్ హెన్స్ మరియు యాంబియంట్ మూడు మోడ్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ 42 గంటల ప్లే టైమ్ తో వస్తుంది.

Also Read: వాహనం నడుపుతున్న వ్యక్తి జేబులో CMF Phone 1 పేలడంతో యాక్సిడెంట్, వ్యక్తి మృతి.!

మంచి కాలింగ్ అనుభూతిని అందించే క్వాడ్ మైక్ AI నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ను కూడా ఇందులో అందించినట్లు షియోమీ తెలిపింది. ఛార్జింగ్ లెవల్ మరియు నోటిఫికేషన్ కోసం ఇందులో అందించింది. ఈ బడ్స్ లో క్విక్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo