Redmi Buds 5: నిన్న జరిగిన ప్రత్యేకమైన లాంఛ్ ఈవెంట్ నుండి రెడ్ మి బడ్స్ 5 ను షియోమి లాంఛ్ చేసింది. ఈ బడ్స్ ను Hybrid 46dB హైబ్రిడ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ మరియు గొప్ప కనెక్టివిటీ సపోర్ట్ లతో లాంఛ్ చేసింది. ఈ కొత్త బడ్స్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లతో పాటుగా సేల్ డేట్ పైన కూడా లుక్కేద్దామా.
షియోమి ఈ రెడ్ మి బడ్స్ 5 ను ఇండియాలో రూ. 2,999 రూపాయల ధరలో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ ఫిబ్రవరి 20 వ తేదీ ను డి స్లే కి అందుబాటులోకి వస్తాయి. ఈ రెడ్ మి బడ్స్ అమేజాన్ మరియు mi.com నుండి సేల్ కి అందుబాటులో ఉంటాయి.
Also Read : vivo T2x 5G: రెండు కొత్త కలర్ వేరియంట్స్ లో వివో బడ్జెట్ 5G ఫోన్.!
రెడ్ మి బడ్స్ 5 ను ఫ్యూజన్ వైట్, ఫ్యూజన్ పర్పల్ మరియు ఫ్యూజన్ బ్లాక్ మూడు కలర్ ఆప్షన్ లలో లాంఛ్ చేసింది. 12.4mm డైనమిక్ స్పీకర్లను Titanium Diaphragm తో అందించింది. ఈ బడ్స్ పవర్ ఫుల్ సౌండ్ ను ఈ స్పీకర్లతో అందించ గలదు. ఇది 20Hz-20kHz ఫ్రీక్వెన్సీ మరియు SBC, AAC లకు సపోర్ట్ చేస్తుంది. Hybrid 46dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ వుంది.
అంతేకాదు, ఈ బడ్స్ డ్యూయల్ మైక్ AI-Noise Reduction లను కూడా కలిగి వుంది. ఈ రెడ్ మి బడ్స్ Bluetooth v5.3 సపోర్ట్ తో వస్తాయి మరియు డ్యూయల్ డివైజ్ కనెక్షన్, Google Fast Pair సపోర్ట్ లను కూడా కలిగి వుంది. ఇది షియోమి ఇయర్ బడ్స్ యాప్ కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, 38 గంటల వరకూ ప్లే బ్యాక్ అందించగలగడమే కాకుండా టచ్ కంట్రోల్స్ ను కూడా కలిగి వుంది.