Realme TechLife Studio H1 హెడ్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ హెడ్ ఫోన్ ను హైబ్రిడ్ నోయిస్ క్యాన్సిలేషన్ మొదలుకొని Hi-Res Audio సపోర్ట్ తో సహా ఆల్ రౌండ్ ఫీచర్ తో లాంచ్ చేస్తోంది. ఈ హెడ్ ఫోన్ కోసం కంపెనీ ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజి ద్వారా ఈ హెడ్ ఫోన్ వివరాలతో టీజింగ్ మొదలు పెట్టింది. కంపెనీ అందించిన టీజర్ స్పెక్స్ ద్వారా ఈ హెడ్ ఫోన్ భారీ ఫీచర్స్ తో లాంచ్ కాబోతున్నట్లు అర్ధం అవుతుంది.
అక్టోబర్ 15వ తేదీ రియల్ మీ లాంచ్ చేయబోతున్న Realme P1 Speed స్మార్ట్ ఫోన్ తో పాటు రియల్ మీ టెక్ లైఫ్ స్టూడియో H1 హెడ్ ఫోన్ ను కూడా లాంచ్ చేస్తోంది.
రియల్ మీ టెక్ లైఫ్ స్టూడియో H1 హెడ్ ఫోన్ ఆల్ రౌండర్ ఫీచర్స్ కలిగి వుంది. ఈ హెడ్ ఫోన్ ను మాట్టే మెటల్ ఫ్రేమ్ మరియు స్కిన్ ఫ్రెండ్లీ మెటీరియల్ లాంచ్ ను కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ హెడ్ ఫోన్ అడ్జెస్ట్ చేయగల హెడ్ బీమ్, స్పాంజ్ మెమరీ కుషన్, ఫంక్షన్ బటన్స్ మరియు మూడవ గల మెటల్ షాఫ్ట్ ను కలిగి ఉంటుంది. ఈ హెడ్ ఫోన్ ను క్రిమ్సన్ బీట్స్, ఐవరీ బీట్స్ మరియు మిడ్ నైట్ మ్యాజిక్ అనే మూడు కలర్ ఆప్షన్ లలో లాంచ్ చేస్తుంది.
ఇక ఈ హెడ్ ఫోన్ ప్రధాన ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ హెడ్ ఫోన్ 43dB హైబ్రిడ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. ఈ హెడ్ ఫోన్ లో 40mm పెద్ద స్పీకర్ ఉంటుదని మరియు ఇది Hi-Res Audio వైర్లెస్, Spatial ఆడియో ఎఫెక్ట్స్ మరియు LDAC హై ఫిడిలిటీ డీకోడింగ్ సపోర్ట్ లతో వస్తుంది. ఈ హెడ్ ఫోన్ ను 70 గంటల ప్లే టైమ్ అందించే పవర్ ఫుల్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ చేస్తోంది.
Also Read: అమెజాన్ సేల్ నుంచి 30 వేల భారీ డిస్కౌంట్ తో లిస్ట్ అయిన Sennheiser AMBEO mini సౌండ్ బార్.!
ఈ అప్ కమింగ్ రియల్ మీ హెడ్ ఫోన్ వివరాలు చూస్తుంటే, ఈ హెడ్ ఫోన్ ను ప్రీమియం డిజైన్, లుక్స్ మరియు ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు క్లియర్ గా అర్థం అవుతోంది. అయితే, ఈ హెడ్ ఫోన్ రేట్ ను ఎలా సెట్ చేస్తోంది చూడాలి.