Realme నుండి కొత్త బడ్స్ ఎయిర్ 2 మరియు స్మార్ట్ టీవీ స్టిక్ మార్కెట్లో విడుదల..!!

Realme నుండి కొత్త బడ్స్ ఎయిర్ 2 మరియు స్మార్ట్ టీవీ స్టిక్ మార్కెట్లో విడుదల..!!
HIGHLIGHTS

Realme మెగా లాంచ్ ఈవెంట్ ద్వారా చాలా ప్రోడక్ట్స్ ని పరిచయం చేసింది

బడ్స్ ఎయిర్ 2 మరియు స్మార్ట్ టీవీ స్టిక్ లను కూడా విడుదల చేసింది

ఎయిర్ బడ్స్ మొత్తంగా 30 గంటల ప్లే బ్యాక్ ను అందిస్తుంది

Realme మెగా లాంచ్ ఈవెంట్ ద్వారా నిన్న చాలా ప్రోడక్ట్స్ ని ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది. Realme 9, GT 2 ప్రో మరియు ల్యాప్ టాప్ లతో పాటుగా  బడ్స్ ఎయిర్ 2 మరియు స్మార్ట్ టీవీ స్టిక్ లను కూడా విడుదల చేసింది. వీటిలో, బడ్స్ ఎయిర్ 2 మరియు స్మార్ట్ టీవీ స్టిక్ గురించి వివరంగా చూడబోతున్నాము. గేమర్స్ మరియు మ్యూజిక్, కంటెంట్ లవర్స్ కోసం తీసుకొచ్చిన ఎయిర్ బడ్స్ మొత్తంగా 30 గంటల ప్లే బ్యాక్ ను అందిస్తుంది. అలాగే, Realme స్మార్ట్ టీవీ స్టిక్ FHD రిజల్యూషన్ తో మాత్రమే వచ్చినా HDR 10+ సపోర్ట్ ను కలిగి వుంది. మరి రియల్ మీ విడుదల చేసిన ఈ రెండు ప్రొడక్స్ట్ వివరాలను చూసేద్దామా.

Realme Buds Air 3: ఫీచర్లు

రియల్ మీ బడ్స్ ఎయిర్ 3, 42dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మరియు డ్యూయల్-మైక్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందిస్తుంది. అంతేకాదు, మీ చుట్టుపక్కల శబ్దాలను వినడానికి వీలుగా ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఇందులో అందించారు. ఈ బడ్స్ 10mm డైనమిక్ 'బాస్ బూస్ట్' స్పీకర్లతో ప్యాక్ చేయబడింది. అద్భుతమైన Bass తో మీ మ్యూజిక్ మరియు మూవీలను ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు, ఒకే సమయలో మీరు రెండు డివైజ్ లకు కనెక్ట్ కూడా చేయవచ్చు. ఇక గేమింగ్ కోసం 88ms సూపర్ లేటెన్సీ మోడ్, స్పోర్ట్ ప్రియులకు IPX5 స్వెట్ రెసిస్టెన్స్ మరియు దీర్ఘకాలిక ఉపయోగం కోసం మొత్తంగా 30 గంటల ప్లే బ్యాక్ వంటి అక్షర్షణీయమైన ఫీచర్లు ఈ Realme Buds Air 3 సొంతం.

Realme Buds Air 3.jpg

Realme Buds Air 3: ధర

రియల్ మీ బడ్స్ ఎయిర్ 3 రూ.3,999 రూపాయల ధరతో విడుదల చెయ్యబడింది. అయితే, లాంచ్ ఆఫర్ ద్వారా 500 డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ డివైజ్ Flipkart మరియు Realme స్టోర్లలో అందుబాటులో వుంది.      

Realme Smart TV Stick FHD

ఇక రియల్ మీ స్మార్ట్ టీవీ స్టిక్ FHD విషయానికి వస్తే, ఇది కేవలం FHD తో రావడం కొంత నిరుత్సహ పరిచే విషయం అయినా HDR 10+ సపోర్ట్ ఉండడంతో ఆకట్టుకుంటుంది. అయితే, ఇది HDR 10+ సపోర్ట్ ఉన్నా కూడా FHD (1080) పిక్సెల్ లో మాత్రేమే కంటెంట్ ను ప్లే చెయ్యగలదు. అయితే, వేగవంతమైన  మీడియా ట్రాన్స్ ఫర్ కోసం HDMI 2.0కి మద్దతు ఉంది. ఇది  క్వాడ్-కోర్ ప్రాసెసర్ ద్వారా నిర్వహించబడుతుంది మరియు Android 11 OS పైన నడుస్తుంది. ఈ రియల్ మీ స్మార్ట్ టీవీ స్టిక్  1GB RAM మరియు 8GB స్టోరేజ్ ను కూడా కలిగి ఉంది.        

Realme Smart TV Stick FHD.jpg

ఈ రియల్ మీ స్మార్ట్ టీవీ స్టిక్ FHD ని రూ.2,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో రియల్ మీ ప్రకటించింది. ఏప్రిల్ 13 నుండి మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి రానున్న ఈ డివైజ్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌ మీ స్టోర్‌ లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo