Realme Buds Air 7: 52dB ANC మరియు LHDC సపోర్ట్ తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన రియల్ మీ.!

ఈరోజు రియల్ మీ ఇండియాలో స్మార్ట్ ఫోన్లు మరియు ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది
Realme Buds Air 7 Hi-Res ఆడియో LHDC సపోర్ట్ తో లాంచ్ చేసింది
ఇది సెగ్మెంట్ 52dB ANC బడ్స్ గా నిలుస్తుంది
Realme Buds Air 7: ఈరోజు రియల్ మీ ఇండియాలో స్మార్ట్ ఫోన్లు మరియు ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది. ఇందులో, రియల్ మీ బడ్స్ ఎయిర్ 7 ఇయర్ బడ్స్ ను 52dB ANC మరియు Hi-Res ఆడియో LHDC సపోర్ట్ తో లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ పై అందించిన లాంచ్ ఆఫర్ తో ఈ రియల్ మీ కొత్త బడ్స్ మంచి ఆఫర్ ధరకు లభిస్తాయి.
Realme Buds Air 7: ప్రైస్
ఈ రియల్ మీ కొత్త ఇయర్ బడ్స్ ను రూ. 3,299 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో విడుదల చేసింది. అయితే, ఈ లేటెస్ట్ ఎయిర్ బడ్స్ పై రూ. 500 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ రియల్ మీ బడ్స్ ను కేవలం రూ. 2,799 రూపాయల ధరకు లభిస్తుంది. మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఇయర్ బడ్స్ ఫస్ట్ సేల్ ప్రారంభం అవుతుంది.
Realme Buds Air 7: ఫీచర్స్
రియల్ మీ బడ్స్ ఎయిర్ 7 ఇయర్ బడ్స్ జేబులో పెట్టుకోవడానికి వీలుగా ఫ్లాట్ బాక్స్ డిజైన్ తో అందించింది. ఈ ఇయర్ బడ్స్ Hi-Res ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ తో అందించినట్లు రియల్ మీ తెలిపింది. ఈ రియల్ మీ బడ్స్ LHDC 5.0 హై డెఫినేషన్ ఆడియో కోడాక్ తో వస్తుంది. దీనికి తగిన సౌండ్ అందించే 12.4mm డీప్ BASS స్పీకర్ ను కూడా ఇందులో అందించింది.
ఈ రియల్ మీ ఇయర్ బడ్స్ ఈ సెగ్మెంట్ లో 52dB స్మార్ట్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) కలిగిన ఏకైక బడ్స్ గా ఉంటాయని రియల్ మీ తెలిపింది. అంతేకాదు, ఇందులో 6-mic కాల్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంది. ఈ బడ్స్ లో 360 డిగ్రీస్ స్పెటియల్ ఆడియో ఎఫెక్ట్ ఫీచర్ కూడా ఉంటుంది.
Also Read: Realme P3 Ultra 5G: ప్రీమియం ఫీచర్స్ తో 25వేల ఉప బడ్జెట్ లో లాంచ్ అయ్యింది.!
ఇది కాకుండా ఈ ఇయర్ బడ్స్ IP55 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ లెట్స్ బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ టోటల్ 52 గంటల ప్లే టైం అందిస్తుంది. ఇందులో డ్యూయల్ డివైజ్ కనెక్షన్, 45ms సూపర్ లో లెటెన్సీ మరియు స్విఫ్ట్ పెయిర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.