Realme Buds Air Neo రూ. 2,999 ధరలో 17 గంటల ప్లే బ్యాక్ సామర్ధ్యంతో వచ్చింది

Updated on 26-May-2020
HIGHLIGHTS

రియల్మి బడ్స్ ఎయిర్ నియోలో పెద్ద 13 MM బాస్ బూస్ట్ డ్రైవర్లు ఉన్నాయి.

ఈ TWS ఇయర్‌ బడ్స్ టచ్ నియంత్రణలకు మద్దతు ఇస్తాయి

బ్లూటూత్ 5.0 లకు ఇన్స్టాంట్ కనెక్టివిటీ అందిస్తుంది.

నిన్న జరిగిన ఒక ప్రత్యేకమైన ఆన్లైన్ కార్యక్రమం ద్వారా రియల్మీ సంస్థ తన బడ్స్ ఎయిర్ నియో టిడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ ని ఇండియాలో విడుదల చేసింది. ఈ బడ్స్ ఎయిర్ నియో టిడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ గొప్ప Bass  సౌండ్ తో పాటుగా మంచి క్వాలిటీ గల సౌండ్ ను  అందించే సామర్ధ్యాని కలిగి ఉంటాయి. ఈ బడ్స్ ఎయిర్ నియో టిడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ గురించిన వివరాలను క్రింద చూడవచ్చు.            

Realme Buds Air Neo TWS  ఇయర్ బడ్స్ : ప్రత్యేకతలు  మరియు ధర

రియల్మి బడ్స్ ఎయిర్ నియోలో పెద్ద 13 MM బాస్ బూస్ట్ డ్రైవర్లు ఉన్నాయి. అంటే, గరిష్టమైన BASS మీకు అందించే సామర్థ్యంతో వస్తుంది. ఈ జత ఇయర్ ‌బడ్స్ ఛార్జింగ్ కేసుతో 17 గంటల విలువైన ప్లేబ్యాక్‌ను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు ఒకే ఛార్జీతో సుమారు 3 గంటలు నిరంతర ప్లే బ్యాక్ సామర్ఢ్యాన్ని కలిగి ఉంటాయి.

బడ్స్ ఎయిర్ నియో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ ఫోన్స్  బ్లూటూత్ 5.0 పై డ్యూయల్-ఛానల్ ట్రాన్స్‌మిషన్ మరియు Super Low లాటెన్సీ  మోడ్‌తో వస్తాయి, ఇది 50% తక్కువ నిరీక్షణ సమయాన్ని నిర్ధారిస్తుంది.

ఈ TWS ఇయర్‌ బడ్స్ టచ్ నియంత్రణలకు మద్దతు ఇస్తాయి. ఇవి మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను నియంత్రించడానికి, కాల్స్‌ ను స్వీకరించడానికి, వర్చువల్ అసిస్టెంట్‌కు వాయిస్ ఆదేశాలను ఇవ్వడానికి మరియు మరెన్నో స్మార్ట్ పనులకు అనుమతిస్తుంది. ఈ రియల్మి బడ్స్ ఎయిర్ నియో గూగుల్ ఫాస్ట్ పెయిర్ మరియు బ్లూటూత్ 5.0 లకు ఇన్స్టాంట్ కనెక్టివిటీ అందిస్తుంది. ఈ జత ఇయర్‌బడ్స్  119.2ms సూపర్-లౌ లెటెన్సీ కూడా అందిస్తున్నాయి.

రియల్మి బడ్స్ ఎయిర్ నియో మూడు రంగులలో లభిస్తుంది – తెలుపు, ఆకుపచ్చ మరియు ఎరుపు మరియు దీని ధరను రూ .2,999 రూపాయలుగా ప్రకటించింది . వైట్ కలర్ వేరియంట్ మే 25 నుండి అమ్మకానికి సిద్ధంగా ఉంది.  మిగిలిన రెండు రంగులు తరువాత తేదీలో అమ్మకానికి వెళ్తాయి. ఇది  మే 8వ తేదీ నుండి సేల్ కి అందుబాటులో ఉంటుంది.                                                               

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :