ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 గంటలు పనిచేసే TWS Buds లాంచ్.!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 గంటలు పనిచేసే TWS Buds లాంచ్.!
HIGHLIGHTS

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 గంటలు పనిచేసే TWS Buds

pTron Zenbuds Evo X1 Max ట్రూ వైర్లెస్ బడ్స్ ఈ ఫీచర్ తో వచ్చింది

ఈ TWS Buds లో రివర్స్ ఛార్జ్ టెక్ కూడా వుంది

దేశంలో ప్రతీ రోజు ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. అందులో, కొన్ని ప్రొడక్ట్స్ చూడగానే ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఉంటాయి. మార్కెట్ లో ఇప్పుడు కొత్తగా విడుదలైన ఒక కొత్త TWS Buds అటువంటి ప్రత్యేకతలను కలిగి ఉందని చెప్పవచ్చు. అదే, pTron కొత్తగా విడుదల చేసిన  Zenbuds Evo X1 Max ట్రూ వైర్లెస్ బడ్స్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 గంటలు పనిచేసే పెద్ద బ్యాటరీతో ఈ బడ్స్ ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ ఫీచర్లు మరియు ధర ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి. 

pTron Zenbuds Evo X1 Max TWS Buds

బడ్జెట్ ధరలో స్మార్ట్ వాచ్, ఆడియో ప్రొడక్ట్స్ మరియు మరిన్ని ఉత్పతులను అందిస్తున్న మంచి బ్రాండ్ గా పీట్రాన్ గుర్తింపు పొందింది. ఈ బ్రాండ్, భారత మార్కెట్ లో కొత్త ఇయర్ బడ్స్ ను మంచి ఫీచర్స్ తో అందించింది. జెన్ బడ్స్ ఈవో ఎక్స్1 మ్యాక్స్ పేరుతో తెచ్చిన ఈ బడ్స్ ను కేవలం రూ. 1,299 ధరలో విడుదల చేసింది. ఈ పీట్రాన్ ఇయర్ బడ్స్ అమెజాన్ ఇండియా నుండి సేల్ అవుతున్నాయి. Buy From Here

pTron Zenbuds Evo X1 Max: ఫీచర్లు

ఈ పీట్రాన్ కొత్త ఇయర్ బడ్స్ ఏకంగా 200 గంటల ప్లే టైం అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఇయర్ బడ్స్ లో రివర్స్ ఛార్జ్ టెక్ కూడా వుంది. దీనికోసం, ఈ బడ్స్ ను 1000mAh బిగ్ బ్యాటరీ సెటప్ తో అందించింది. ఈ బడ్స్ లో అందించిన రివర్స్ ఛార్జ్ ఫీచర్ తో అత్యవసర సమయంలో ఫోన్ ను సైతం ఛార్జ్ చేసుకునే వీలుంటుందని పీట్రాన్ తెలిపింది.

Also Read: ICC Men’s T20 World Cup కోసం ఎయిర్టెల్ ప్రత్యేకమైన ప్లాన్స్.. ఒక లుక్కేయండి.!

ఈ బడ్స్ లో అందించిన క్వాడ్ మైక్ మరియు ట్రూ టాక్ ENC టెక్ తో మంచి క్వాలిటీ కాలింగ్ సౌకర్యం అందిస్తుందని కూడా పీట్రాన్ పేర్కొంది. డీప్ బాస్ మరియు స్టీరియో అందించే 13mm స్పీకర్లు ఈ బడ్స్ లో ఉన్నాయి. ఈ బడ్స్ బ్లూటూత్ వెర్షన్ 5.3 తో వస్తుంది మరియు అంతరాయం లేని కనెక్టివిటీ అందిస్తుంది. ఈ బడ్స్ టైప్-C ఛార్జ్ పోర్ట్ తో వస్తుంది మరియు IPX5 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. 

pTron Zenbuds Evo X1 Max TWS Buds
pTron Zenbuds Evo X1 Max TWS Buds

ఈ బడ్స్ ను బాక్స్ తో సహా పూర్తిగా ఛార్జ్ చేయడానికి 1.5 గంటల సమయం పడుతుంది. ఈ బడ్స్ పాసివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం ఇందులో 40ms తక్కువ జాప్యం ఫీచర్ కూడా వుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo