New Launch: పిల్లల కోసం Wireless Headphones లాంఛ్ చేసిన Promate.!

Updated on 27-Feb-2024
HIGHLIGHTS

Promate ఈరోజు ఇండియన్ మార్కెట్ లో కొత్త ప్రోడక్ట్ ను లాంచ్ చేసింది

పిల్లకు తగిన ఫీచర్స్ మరియు డిజైన్ తో కొత్త Wireless Headphones ను లాంఛ్ చేసింది

ఈ వైర్లెస్ హెడ్ ఫోన్ లను ప్రత్యేకంగా పిల్లల కోసమే తీసుకు వచ్చినట్లు ప్రోమేట్ తెలిపింది

New Launch: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Promate ఈరోజు ఇండియన్ మార్కెట్ లో కొత్త ప్రోడక్ట్ ను లాంచ్ చేసింది. ఆన్లైన్ క్లాస్ మరియు మ్యూజిక్ ను ఆస్వాదించడానికి పిల్లకు తగిన ఫీచర్స్ మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో కొత్త Wireless Headphones ను లాంఛ్ చేసింది. ఈ వైర్లెస్ హెడ్ ఫోన్ లను ప్రత్యేకంగా పిల్లల కోసమే తీసుకు వచ్చినట్లు ప్రోమేట్ తెలిపింది. ఈ హెడ్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

Promate Wireless Headphones

Promate Panda వైర్లెస్ హెడ్ ఫోన్ పేరుతో ఈ కొత్త ప్రోడక్ట్ ను లాంఛ్ చేసింది. ఈ హెడ్ ఫోన్ ఓవర్ ది ఇయర్ హెడ్ మరియు పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చెయ్యబడిందని ప్రొమేట్ తెలిపింది. ఈ కొత్త Promate Panda వైర్లెస్ హెడ్ ఫోన్ లను Rs. 2,999 ధరతో లాంఛ్ చేసింది మరియు ఈ హెడ్ ఫోన్స్ Amazon నుండి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. అయితే, లాంఛ్ ఆఫర్ లో భాగంగా ఈ హెడ్ ఫోన్ లను కేవలం రూ. 2,499 ధరకే అమేజాన్ ఆఫర్ చేస్తోంది. Buy From Amazon

Also Read: రూ.1,000 బడ్జెట్ లో బెస్ట్ Smart Watch Deals పైన ఒక లుక్కేయండి.!

Promate Panda Specs

ఈ వైర్లెస్ హెడ్ ఫోన్ లను కంపెనీ పిల్లలకు తగిన సేఫ్టీ ఫీచర్స్ తో తీసుకు వచ్చింది. ఈ హెడ్ ఫోన్ లను చూడచక్కని Kawaii Cat డిజైన్ తో అట్రాక్టివ్ గా కనిపించేలా డిజైన్ చేసింది. అలాగే, పిల్లలను ఆకర్షించేలా వుండే Aqua, Bubble Gum మరియు Lilac వంటి మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో అందించింది.ఆ అంతేకాదు, ఇందులో illuminated (LED) లను కూడా అందించింది.

promate panda Wireless Headphones

ఈ హెడ్ ఫోన్స్ గరిష్టంగా 93Db వరకూ మాత్రమే సౌండ్ అందించేలా వాల్యూమ్ లిమిట్ తో వస్తుంది. అంటే, పిల్లల చెవులకు హాని కలగని లిమిట్ వరకూ సౌండ్ ను ప్రొడ్యూజ్ చేస్తుంది. పిల్లల safety & comfort ను పూర్తిగా దృష్టిలో ఉంచుకొని ఈ హెడ్ ఫోన్ లను తయారు చేసినట్లు కంపెనీ నొక్కి చెబుతోంది.

ఇది Wired మరియు Wireless గా కూడా పని చేస్తుంది. ఇది 40 గంటల ప్లే బ్యాక్ అందించగల బ్యాటరీతో వస్తుంది మరియు Bluetooth v5.0 సపోర్ట్ తో ఉంటుంది. ఈ హెడ్ ఫోన్ బ్యాటరీ నిండుకుంటే AUX కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకొని నిరంతరంగా వైర్డ్ హెడ్ ఫోన్ గా వినియోగించుకోవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :