పోకో ఈరోజు ఇండియాలో రెండు ప్రొడక్ట్స్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో పోకో కొత్త 5జి ఫోన్ Poco M6 Plus 5G మరియు Poco Buds X1 ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో 108MP కెమెరా వంటి ఫీచర్స్ తో తెచ్చింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ను కూడా చాలా సరసమైన ధరలో ANC సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో అందించింది.
పోకో ఈ కొత్త బడ్స్ ను ఆఫర్ తో కలిపి కేవలం రూ. 1,699 ధరతో విడుదల చేసింది.
పోకో ఈ కొత్త బడ్స్ ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది. ఈ బడ్స్ ను యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో (ANC) అందించింది. ఈ ANC ఫీచర్ తో ఈ బడ్స్ 40dB వరకు హైబ్రిడ్ నోయిస్ రిడక్షన్ ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఈ కొత్త పోకో బడ్స్ ట్రాన్స్ పరెన్సీ, నాయిస్ క్యాన్సిలేషన్ మరియు ఆఫ్ మూడు మోడ్స్ తో వస్తుంది మరియు షియోమీ యొక్క యాంటీ విండ్ అల్గోరిథం తో కూడా వస్తుంది.
ఈ పోకో కొత్త ఇయర్ బడ్స్ లో 12.4mm డైనమిక్ టైటానియం స్పీకర్స్ ఉన్నాయి. ఇది స్పీకర్ గొప్ప సౌండ్ ను అందిస్తుంది మరియు SBC మరియు AAC కోడెక్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ ను కలిగి ఉంటుంది మరియు IP54 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Also Read: FASTag New Rules: ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్..!
ఈ ఇయర్ బడ్స్ AI నోయిస్ రిడక్షన్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ మైక్ తో వస్తాయి. ఈ బడ్స్ లో అందించిన ఈ ఫీచర్ తో నాణ్యమైన కాలింగ్ ను పొందవచ్చని పోకో తెలిపింది. ఈ బడ్స్ గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ సపోర్ట్ తో వస్తుంది. అయితే, ఈ ఇయర్ బడ్స్ లో డ్యూయల్ పెయిరింగ్ సపోర్ట్ ఇవ్వకపోవడం ఒక లోటుగా చెప్పవచ్చు. ఈ బడ్స్ టైప్ C ఛార్జ్ పోర్ట్ తో వస్తుంది మరియు 36 గంటల టోటల్ ప్లే టైమ్ అందిస్తుంది.