Philips పఫర్ ఫుల్ సౌండ్ వైర్ లెస్ సబ్ ఉఫర్ తో రెండు సౌండ్ బార్స్ ను లాంచ్ చేసింది

Updated on 18-Feb-2021
HIGHLIGHTS

Philips, ఇండియాలో తన రెండు కొత్త సౌండ్ బార్స్ ను విడుదల చేసింది.

సౌండ్ బార్స్ లో ఒకటి 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు రెండవది 3.1 ఛానల్ సౌండ్ బార్

ఈ ఫిలిప్స్ సౌండ్ బార్స్ మంచి డిజైన్, పవర్ ఫుల్ సౌండ్ మరియు ఫీచర్లతో తీసుకురాబడ్డాయి.

Philips, ఇండియాలో తన రెండు కొత్త సౌండ్ బార్స్ ను విడుదల చేసింది. ఈ రెండు సౌండ్ బార్స్ ను కూడా పవర్ ఫుల్ వైర్ లెస్ సబ్ ఉఫర్ తో లాంచ్ చేసింది. ఈ ఫిలిప్స్ సౌండ్ బార్స్ మంచి డిజైన్, పవర్ ఫుల్ సౌండ్ మరియు ఫీచర్లతో తీసుకురాబడ్డాయి. ఈ రెండు సౌండ్ బార్స్ లో ఒకటి 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు రెండవది 3.1 ఛానల్ సౌండ్ బార్. అయితే, ఈ కొత్త సౌండ్ బార్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Philips సరికొత్తగా ఇండియాలో లాంచ్ చేసిన ఈ సౌండ్ బార్స్ లో 2.1 ఛానల్ సౌండ్ బార్ ని TAB7305 మోడల్ నంబర్ తో రెండవ సౌండ్ బార్ నిTAPB7603  మోడల్ నంబర్ తో 3.1 ఛానల్ తో ప్రకటించింది. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా HDMI ARC, ఆప్టికల్ ఇన్ పుట్, 3.5 mm  ఇన్ పుట్ మరియు బ్లూటూత్ 4.2 వంటి మల్టి కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉన్నాయి.

Philips TAPB7603 3.1: ప్రత్యేకతలు

Philips TAPB7603 3.1 Price:  Rs.21,990/-

ఈ సౌండ్ బార్ 3.1 ఛానల్ సౌండ్ బార్ మరియు HDMI ARC, ఆప్టికల్ ఇన్ పుట్, 3.5 mm  ఇన్ పుట్ మరియు బ్లూటూత్ 4.2 కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ 300 W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది. అయితే, ఇందులో 160 W సౌండ్ బార్ నుండి 140W సబ్ ఉఫర్ తో అంధిస్తుంది. ఈ సౌండ్ బార్ మెయిన్ యూనిట్ లో ఇరువైపులా మిడిల్ రేంజ్ మరియు ట్వీటర్లను కలిగి వుంటుంది. ఈ TAPB7603 సౌండ్ బార్ Dolby Digital, Dolby Digital Plus మరియు 2 ఛానల్ LPCM సపోర్ట్ తో వస్తుంది.

Philips TAB7305 ప్రత్యేకతలు

Philips TAB7305 2.1 Price: Rs.14,990/-

ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు HDMI ARC, ఆప్టికల్ ఇన్ పుట్, 3.5 mm  ఇన్ పుట్ మరియు బ్లూటూత్ 4.2 కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ 110 W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది. అయితే, ఇందులో 70 W సౌండ్ బార్ నుండి 40 W సబ్ ఉఫర్ తో అంధిస్తుంది. ఈ సౌండ్ బార్ మెయిన్ యూనిట్ లో ఇరువైపులా రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లను కలిగి వుంటుంది. ఈ TAB7305 సౌండ్ బార్ 2 ఛానల్ LPCM సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :