Philips పఫర్ ఫుల్ సౌండ్ వైర్ లెస్ సబ్ ఉఫర్ తో రెండు సౌండ్ బార్స్ ను లాంచ్ చేసింది
Philips, ఇండియాలో తన రెండు కొత్త సౌండ్ బార్స్ ను విడుదల చేసింది.
సౌండ్ బార్స్ లో ఒకటి 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు రెండవది 3.1 ఛానల్ సౌండ్ బార్
ఈ ఫిలిప్స్ సౌండ్ బార్స్ మంచి డిజైన్, పవర్ ఫుల్ సౌండ్ మరియు ఫీచర్లతో తీసుకురాబడ్డాయి.
Philips, ఇండియాలో తన రెండు కొత్త సౌండ్ బార్స్ ను విడుదల చేసింది. ఈ రెండు సౌండ్ బార్స్ ను కూడా పవర్ ఫుల్ వైర్ లెస్ సబ్ ఉఫర్ తో లాంచ్ చేసింది. ఈ ఫిలిప్స్ సౌండ్ బార్స్ మంచి డిజైన్, పవర్ ఫుల్ సౌండ్ మరియు ఫీచర్లతో తీసుకురాబడ్డాయి. ఈ రెండు సౌండ్ బార్స్ లో ఒకటి 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు రెండవది 3.1 ఛానల్ సౌండ్ బార్. అయితే, ఈ కొత్త సౌండ్ బార్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Philips సరికొత్తగా ఇండియాలో లాంచ్ చేసిన ఈ సౌండ్ బార్స్ లో 2.1 ఛానల్ సౌండ్ బార్ ని TAB7305 మోడల్ నంబర్ తో రెండవ సౌండ్ బార్ నిTAPB7603 మోడల్ నంబర్ తో 3.1 ఛానల్ తో ప్రకటించింది. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా HDMI ARC, ఆప్టికల్ ఇన్ పుట్, 3.5 mm ఇన్ పుట్ మరియు బ్లూటూత్ 4.2 వంటి మల్టి కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉన్నాయి.
Philips TAPB7603 3.1: ప్రత్యేకతలు
Philips TAPB7603 3.1 Price: Rs.21,990/-
ఈ సౌండ్ బార్ 3.1 ఛానల్ సౌండ్ బార్ మరియు HDMI ARC, ఆప్టికల్ ఇన్ పుట్, 3.5 mm ఇన్ పుట్ మరియు బ్లూటూత్ 4.2 కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ 300 W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది. అయితే, ఇందులో 160 W సౌండ్ బార్ నుండి 140W సబ్ ఉఫర్ తో అంధిస్తుంది. ఈ సౌండ్ బార్ మెయిన్ యూనిట్ లో ఇరువైపులా మిడిల్ రేంజ్ మరియు ట్వీటర్లను కలిగి వుంటుంది. ఈ TAPB7603 సౌండ్ బార్ Dolby Digital, Dolby Digital Plus మరియు 2 ఛానల్ LPCM సపోర్ట్ తో వస్తుంది.
Philips TAB7305 ప్రత్యేకతలు
Philips TAB7305 2.1 Price: Rs.14,990/-
ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు HDMI ARC, ఆప్టికల్ ఇన్ పుట్, 3.5 mm ఇన్ పుట్ మరియు బ్లూటూత్ 4.2 కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ 110 W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది. అయితే, ఇందులో 70 W సౌండ్ బార్ నుండి 40 W సబ్ ఉఫర్ తో అంధిస్తుంది. ఈ సౌండ్ బార్ మెయిన్ యూనిట్ లో ఇరువైపులా రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లను కలిగి వుంటుంది. ఈ TAB7305 సౌండ్ బార్ 2 ఛానల్ LPCM సపోర్ట్ తో వస్తుంది.