OPPO Enco M32: బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో వచ్చిన ఒప్పో వైర్‌లెస్ నెక్‌బ్యాండ్
OPPO తక్కవ సమయ ఛార్జింగ్ తో ఎక్కువ కాలం పనిచేసే వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ OPPO Enco M32 ను ప్రకటించింది
కేవలం రూ.1,499 రూపాయల తక్కువ ధరకే అఫర్ చేస్తోంది
OPPO Enco M32 వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ 10mm డ్రైవర్స్ ను ప్యాక్ చేస్తుంది
ప్రముఖ స్మార్ట్ డివైజ్ తయారిదారు OPPO, తక్కవ సమయ ఛార్జింగ్ తో ఎక్కువ కాలం పనిచేసే వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ను ప్రకటించింది. అదే, OPPO Enco M32 మరియు ఇది కేవలం రూ.1,799 రూపాయల ధరలో విడుదల చేసింది. అయితే, లాంచ్ అఫర్ లో భాగంగా 300 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.1,499 రూపాయల తక్కువ ధరకే అఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ కేవలం జనవరి 10 నుండి జనవరి 12 వ తేదీ వరకు అమెజాన్ మరియు OPPO స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
OPPO Enco M32: ఫీచర్లు
OPPO Enco M32 వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ 10mm డ్రైవర్స్ ను ప్యాక్ చేస్తుంది మరియు ఇవి గుర్తించదగిన బాస్, స్పష్టమైన మిడ్స్ మరియు క్రిస్పీ హైస్ తో చాలా సమతుల్యమైన సౌండ్ అందిస్తాయని ఒప్పో తెలిపింది. ఇది దుమ్ము మరియు వాటర్ రెసిస్టెంట్ కలిగివుండే IP55 రేటింగ్ కలిగి వుంది.
OPPO Enco M32 వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో వస్తుంది. కాబట్టి, ఎటువంటి అంతరాయం లేని కాలింగ్ మరియు మ్యూజిక్ ను ఆస్వాదించవచ్చు. ఈ నెక్‌బ్యాండ్ కేవలం 10 నిముషాల ఛార్జింగ్ తో 20 గంటల ప్లే బ్యాక్ మరియు 35 నిముషాల ఛార్జింగ్ తో 28 గంటల నిరంతర ప్లే బ్యాక్ ను అందించగలదని కంపెనీ తెలిపింది.