టెక్నాలజీకి కొత్తదనాన్ని జోడించడంలో ముందుండే Oneplus కొత్త ఫీచర్లతో వన్ ప్లస్ నార్డ్ బడ్స్ CE పేరుతొ కొత్త ట్రూ వైర్లెస్ బడ్స్ ను ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ సరికొత్త బడ్స్ ను పెద్ద స్పీకర్లతో పాటుగా సౌండ్ మాస్టర్ ఈక్వలైజర్ మరిన్ని ఫీచర్లతో తీసుకొచ్చింది. అంతేకాదు, ఈ బడ్స్ ను ఇండియన్ మార్కెట్ లో వినియోగదారులను ఆకర్షించేలా సరైన ధరలో అందించింది. వన్ ప్లస్ కొత్తగా తీసుకొచ్చిన ఈ OnePlus Nord Buds CE యొక్క విశేషాలు మరియు ధర వివరాలను తెలుసుకుందామా.
వన్ ప్లస్ ఈ వన్ ప్లస్ నార్డ్ బడ్స్ CE ని కేవలం రూ.2,299 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బడ్స్ ఆగష్టు 4 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి అధికారిక వెబ్ సైట్ ద్వారా సేల్ కి అంధుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ మూన్ లైట్ వైట్ మరియు మిస్టీ గ్రే అనే రెండు రంగుల్లో లభిస్తుంది.
ఇక ఈ బడ్స్ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే, ఈ బడ్స్ ని పెద్ద 13.4mm డైనమిక్ డ్రైవర్స్ తో అందించింది. తద్వారా, డీప్ మరియు హెవీ Bass ను ఆస్వాదించవచ్చని వన్ ప్లస్ తెలిపింది. దీనికి తోడు ఇందులో అందించిన సౌండ్ మాస్టర్ ఈక్వలైజర్ సౌండ్ ను మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఈ ఈక్వలైజర్ లో Bass, Serenade, Gentle మరియు Balanced అనే నాలుగు మోడ్స్ ఉంటాయి.
మంచి కాలింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం ఇందులో AI నోయిస్ క్యాన్సిలేషన్ ని జతచేసింది. అంతేకాదు, అద్భుతమైన గేమింగ్ అనుభవం కోసం 94ms అల్ట్రా-లో లేటెన్సీ తో వస్తుంది. OnePlus Nord Buds CE మొత్తంగా 20 గంటల ప్లే టైం అందిస్తుందని వన్ ప్లస్ చెబుతోంది. ఈ బడ్స్ కేవలం 3.5 గ్రామూల బరువుతో చాలా తేలికగా ఉంటాయి.