OnePlus Nord Buds 3 ఇయర్ బడ్స్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది వన్ ప్లస్. ఈ బడ్స్ ను బడ్జెట్ సెగ్మెంట్ లో అందించే అవకాశం వుంది. ఎందుకంటే, ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ ను ఇటీవల విడుదల చేసిన వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో డౌన్ టోన్ వెర్షన్ గా తీసుకు వచ్చే అవకాశం వుంది. వన్ ప్లస్ లాంచ్ చేయనున్న ఈ బడ్స్ తో టీజింగ్ మొదలుపెట్టింది.
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3 ఇయర్ బడ్స్ ను సెప్టెంబర్ 17 వ తేదీ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఇయర్ బడ్స్ లాంచ్ డేట్ తో పాటు ఈ బడ్స్ టీజర్ ను మరియు కలర్ వేరియంట్ వివరాలు హింట్ చేస్తూ ఆటపట్టిస్తోంది.
వన్ ప్లస్ బడ్స్ ప్రో 3 ఇయర్ బడ్స్ ను బడ్జెట్ ఫీచర్స్ తో తీసుకు వస్తోంది. ఈ బడ్స్ ను బడ్జెట్ ధరలో తీసుకు వచ్చినా యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ తీసుకురావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే, రీసెంట్ గా మార్కెట్ లో విడుదలైన అన్ని ప్రధాన బ్రాండ్ ఇయర్ బడ్స్ కూడా రూ. 2,000 కంటే తక్కువ ధరలోనే ANC ఫీచర్ తో విడుదలయ్యాయి.
వన్ ప్లస్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయితే మాత్రం బడ్జెట్ ధరలో ఈ బడ్స్ ను ANC ఫీచర్ తో అందించే అవకాశం ఉండవచ్చు. వాస్తవానికి, ఇటీవల విడుదల చేసిన OnePlus Nord Buds 3 Pro ఇయర్ బడ్స్ ను 49Db Active Noise Cancellation మరియు డైనమిక్ డ్రైవర్స్ తో పాటు 44 గంటల ప్లే సపోర్ట్ తో పాటు ఫాస్ట్ ఛార్జ్ వంటి చాలా ఫీచర్స్ తో వచ్చింది.
Also Read: Smartphone Deal: కేవలం రూ. 7,999 ధరకే 16GB + 256GB స్మార్ట్ ఫోన్ అందుకోండి.!
అయితే, ఇది ప్రో వెర్షన్ కాబట్టి ఈ అప్ కమింగ్ బడ్స్ కొన్ని ఫీచర్స్ ను మిస్ చేసుకునే అవకాశం ఉండవచ్చు. అయితే, ఇవన్నీ కూడా మార్కెట్ వర్గాలు వేస్తున్న అంచనాలు మాత్రమే. ఈ బడ్స్ గురించి ఒక అవగాహన రావాలంటే, వన్ ప్లస్ అధికారికంగా ఈ బడ్స్ వివరాలు అందించే వరకు మనం వేచి చూడాలి.