వన్ ప్లస్ కొత్త నెక్ బ్యాండ్ ను విడుదల చేసింది మరియు ఈ బడ్స్ సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకువచ్చింది. OnePlus Bullets Wireless Z2 ANC పేరుతో తీసుకువచ్చిన ఈ వన్ ప్లస్ నెక్ బ్యాండ్ 45dB హైబ్రిడ్ ANC టెక్ తో వచ్చింది. ఈ లేటెస్ట్ వన్ ప్లస్ నెక్ బ్యాండ్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లను వివరంగా తెలుసుకోండి.
వన్ ప్లస్ లేటెస్ట్ గా లాంచ్ లాంచ్ చేసిన ఈ నెక్ బ్యాండ్ రూ. 2,299 ధరతో లిస్టింగ్ చెయ్యబడింది. ఈ నెక్ బ్యాండ్ Flipkart, oneplus అధికారిక వెబ్సైట్ మరియు అధీకృత స్టోర్స్ నుండి లభిస్తుంది.
ఈ వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ Z2 ANC బ్లూటూత్ నెక్ బ్యాండ్ 45dB హైబ్రిడ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ టెక్ తో వస్తుంది కాబట్టి, చుట్టూ ఉండే రణగోన ధ్వనుల నుండి విముక్తి లభిస్తుంది. ఈ నెక్ బ్యాండ్ లో 12.4mm డైనమిక్ స్పీకర్లు టైటానియం కోటింగ్ తో కలిగి ఉన్నాయి. ఇది రిచ్ ఆడియో డిటైల్స్ మరియు Deep BASS తో పవర్ ఫుల్ బీట్స్ అందిస్తుందని వన్ ప్లస్ తెలిపింది.
ఈ నెక్ బ్యాండ్ లో ఉన్న 3-mic AI కాల్ నోయిస్ క్యాన్సిలేషన్ కాలింగ్ సమయంలో ఎటువంటి అంతరాయం సరళమైన వాయిస్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ నెక్ బ్యాండ్ ను రెండు డివైజెస్ కు కనెక్ట్ చెయవచ్చు మరియు Quick Switch ఫీచర్ ద్వారా చిటికెలో ఈ రెండు డివైజెస్ లో మారవచ్చు.
ఇక ఈ OnePlus Bullets Wireless Z2 ANC ఛార్జ్ టెక్ మరియు ప్లే బ్యాక్ టైమ్ ఎలా ఉన్నాయని చూస్తే, ఈ నెక్ బ్యాండ్ టోటల్ 28 గంటల ప్లేబ్యాక్ అందించ గలదు మరియు ఇందులో ఉన్న అల్ట్రా ఫాస్ట్ టెక్ సపోర్ట్ తో 10 నిముషాల ఛార్జింగ్ తో 20 గంటల ప్లేబ్యాక్ ను ఆనందించవచ్చని వన్ ప్లస్ తెలిపింది.