లేటెస్ట్ గా వచ్చిన నథింగ్ ఇయర్ స్టిక్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

లేటెస్ట్ గా వచ్చిన నథింగ్ ఇయర్ స్టిక్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
HIGHLIGHTS

గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్ లోకి నథింగ్ ఇయర్ స్టిక్ ను ప్రవేశపెట్టింది

ఇయర్ స్టిక్ క్లియర్ వాయిస్ టెక్నాలజీతో వచ్చింది

Ear Stick నీటి నిరోధకత కోసం IP54 ధృవీకరణతో వస్తుంది

గ్లోబల్ మరియు ఇండియన్ మార్కెట్ లోకి నథింగ్ ఇయర్ స్టిక్ ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త నథింగ్ ఇయర్ స్టిక్ ను రూ.8,499 ధరతో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ ఇయర్ స్టిక్ ను పూర్తిగా క్లియర్ వాయిస్ అందించే విద్ధంగా మూడు మైక్ లతో క్లియర్ వాయిస్ టెక్నాలజీని  అందించింది. అయితే, నథింగ్ ఇయర్ 1 తో అందించిన ANC యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ని దాటవేసింది. Nothing Ear Sticks ఎటువంటి ఫీచర్లతో వచ్చింది మరియు ఇయర్ 1 మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు కూడా వివరంగా చూద్దామా.

Nothing Ear Sticks: ధర

నథింగ్ ఇయర్ స్టిక్ ను కంపెనీ ఇండియాలో రూ.8,499 రూపాయల ధరలో విడుదల చేసింది. Ear Sticks లను మీరు నవంబర్ 4 నుండి Myntra మరియు Flipkart నుండి పొందవచ్చు. అయితే, మరు ఈ నథింగ్ ఇయర్ సిక్స్ లను కోరుకునట్లయితే ప్రీ ఆర్డర్స్ ను చెయవచ్చు.

Nothing Ear Sticks: ఫీచర్లు

నథింగ్ ఇయర్ స్టిక్ ముందుగా వచ్చిన ఇయర్ 1 లో ఉన్న 11.6mm స్పీకర్ల కంటే కొంచెం పెద్దవైన 12.6mm స్పీకర్లను కలిగి ఉంటాయి. అయితే, ఇయర్ 1 లో ఉన్న ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్) మాత్రం ఇయర్ స్టిక్ లో లేదు. అయితే, ఇయర్ 1లోని IPX4 రేటింగ్‌తో పోలిస్తే, Ear Stick దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP54 ధృవీకరణతో వస్తుంది. అంటే, సెక్యూరిటీ మరియు సేఫ్టీ పరంగా మరింత కఠినంగా వుంది.

ఇయర్ 1 లో టచ్ కంట్రోల్స్ ఉండగా, ఇయర్ స్టిక్స్ లో మాత్రం ప్రెస్ కంట్రోల్స్ తో వస్తుంది. అంటే, సంగీతం, వాల్యూమ్ నియంత్రణలు మరియు ఫోన్ అసిస్టెంట్ కోసం ప్రెస్ కంట్రోల్స్ ను పొందుతారు. ఇక ఈ రెండు ఇయర్‌బడ్‌ లలో ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం గురించి చూస్తే, క్లియర్ వాయిస్ టెక్నాలజీ ప్రధానమైనది. ఈ టెక్  కాల్‌ల సమయంలో గాలి మరియు రణగొని శబ్దాలను నిరోధించడానికి 3 మైక్‌లను ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది.

బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే, ఇయర్ 1 ఇయర్ బడ్స్ 34 గంటలు రన్ అవుతుందని రేట్ చేయగా, కొత్తగా వచ్చిన ఇయర్ స్టిక్స్ 29 గంటల పాటు రన్ అవుతుందని కంపెనీ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo