Nothing Ear (Open): ఓపెన్ బూమ్ సౌండ్ డిజైన్ తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన నథింగ్.!

Nothing Ear (Open): ఓపెన్ బూమ్ సౌండ్ డిజైన్ తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన నథింగ్.!
HIGHLIGHTS

Nothing Ear (Open) ఇయర్ బడ్స్ ను ఇండియాలో నథింగ్ లాంచ్ చేసింది

ఈ ఇయర్ బడ్స్ ను సరికొత్త ఓపెన్ బూమ్ సౌండ్ డిజైన్ తో అందించింది

ఈ బడ్స్ ఓపెన్ డిజైన్ తో ఉన్నా పవర్ ఫుల్ BASS సౌండ్ అందిస్తుంది

Nothing Ear (Open) కొత్త ఇయర్ బడ్స్ ను ఇండియాలో నథింగ్ లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ ను సరికొత్త ఓపెన్ బూమ్ సౌండ్ డిజైన్ తో అందించింది. ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న క్లోజ్ ఫిట్ మాదిరిగా కాకుండా ఈ బడ్స్ ను పూర్తిగా ఓపెన్ డిజైన్ తో అందించింది. ఈ బడ్స్ ఓపెన్ డిజైన్ తో ఉన్నా పవర్ ఫుల్ BASS సౌండ్ అందిస్తుంది.

Nothing Ear (Open): ఫీచర్స్

నథింగ్ ఇయర్ (ఓపెన్) ఇయర్ బడ్స్ ను సరికొత్త డిజైన్ తో అందించింది. ఈ బడ్స్ ను చెవుల మీదుగా ఫిట్ చేసుకునే పేటెంట్ పెండింగ్ డిజైన్ తో అందించింది. ఈ బడ్స్ రెగ్యులర్ క్లోజ్డ్ ఇయర్ బడ్స్ మాదిరి డిజైన్ తో కాకుండా ఓపెన్ డిజైన్ తో అందించింది. ఈ బడ్స్ లో 14.2mm డైనమిక్ డ్రైవర్స్ ను అందించింది. ఇది పవర్ ఫుల్ BASS మరియు క్లియర్ సౌండ్ అందిస్తుంది.

Nothing Ear (Open)

ఈ కొత్త నథింగ్ బడ్స్ అల్టిమేట్ కంఫర్ట్ అందిస్తుంది మరియు చాలా లైట్ వైట్ తో ఉంటుంది. ఇందులో అడ్వాన్స్డ్ ఈక్వలైజర్ లైజర్ సపోర్ట్ మరియు పించ్ కంట్రోల్ లను కలిగి వుంది. ఈ బడ్స్ IP54 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ బడ్స్ BASS ఎన్ హెన్స్, గూగుల్ ఫాస్ట్ పెయిర్ మరియు మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్ సపోర్ట్ లను కలిగి వుంది.

ఈ నథింగ్ ఇయర్ (ఓపెన్) ఇయర్ బడ్స్ Bluetooth 5.3 మరియు LE సపోర్ట్ తో మంచి కనెక్టివిటీ అందిస్తుంది. ఇందులో AI క్లియర్ వాయిస్ టెక్నాలజీ మరియు లో ల్యాగ్ మోడ్ వంటి ఫీచర్ కూడా ఉన్నాయి.

Also Read: WhatsApp Camera కోసం కొత్త ఫీచర్ ను తెస్తున్న వాట్సాప్.!

Nothing Ear (Open): ధర

నథింగ్ ఈ కొత్త ఇయర్ బడ్స్ ను రూ. 17.999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ బడ్స్ nothing.tech నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo