Noise Master Buds: స్టన్నింగ్ డిజైన్ మరియు BOSE సౌండ్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

Noise Master Buds: స్టన్నింగ్ డిజైన్ మరియు BOSE సౌండ్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
HIGHLIGHTS

నోయిస్ టీజింగ్ చేస్తున్న Noise Master Buds ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది

స్టన్నింగ్ డిజైన్ మరియు BOSE సౌండ్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది

ఈ బడ్స్ ను కేవలం రూ. 5,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు

Noise Master Buds: గత కొంత కాలంగా నోయిస్ టీజింగ్ చేస్తున్న నోయిస్ మాస్టర్ బడ్స్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త బడ్స్ ను స్టన్నింగ్ డిజైన్ మరియు BOSE సౌండ్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ముందెన్నడూ లేని విధంగా ఈ బడ్స్ ను సరికొత్త మరియు చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో అందించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు, ఈ బడ్స్ ధరను ను బడ్జెట్ యూజర్ ను దృష్టిలో ఉంచుకొని అందించినట్లు అర్ధం అవుతుంది.

Noise Master Buds: ప్రైస్

నోయిస్ మాస్టర్ బడ్స్ ను రూ. 7,999 MRP ధరతో లాంచ్ చేసింది. అయితే, Pre-Book చేసుకునే వారికి ఈ బడ్స్ పై గొప్ప డీల్స్ అందించింది. ఈ డీల్స్ తో ఈ బడ్స్ ను కేవలం రూ. 5,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

ఏమిటా Pre-Book ఆఫర్లు?

నోయిస్ మాస్టర్ బడ్స్ ను రూ.999 రూపాయలు చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకునే యూజర్లకు రూ. 2,000 రూపాయల ప్రీ ఆర్డర్ పాస్ (కూపన్) అందిస్తుంది. సేల్ మొదలైనప్పుడు ఈ పాస్ లేదా కూపన్ ను ఉపయోగించి రూ. 5,999 తో బడ్స్ ను అందుకోవచ్చు. ఈ పాస్ లాంచ్ డేట్ నుంచి 14 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, 6 నెలల No Cost EMI ఆఫర్ ని కూడా ఈ బడ్స్ పై అందిస్తోంది.

Noise Master Buds: ఫీచర్స్

నోయిస్ మాస్టర్ బడ్స్ ను ఒరిజినల్ ఆడియో ఫార్మాట్ వినైల్ రికార్డ్ ఇన్స్పిరేషన్ తో అందించింది. ఈ బడ్స్ కేవలం 4.2 గ్రాముల బరువుతో చాలా లైట్ గా ఉంటాయి మరియు చాలా కంఫర్ట్ ఫిట్ తో వస్తాయి, అని నోయిస్ తెలిపింది. నోయిస్ ఈ బడ్స్ ను Sound By BOSE సౌండ్ సపోర్ట్ అందించింది. ఈ బడ్స్ ను పేరుకు తగ్గట్టుగానే మాస్టర్ డిజైన్ మరియు ఫీచర్స్ తో అందించింది.

ఈ నోయిస్ కొత్త బడ్స్ LHDC 5.0 తో రియల్ డీటెయిల్స్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది గరిష్టంగా 24bit / 96 kHz High-Res Audio సపోర్ట్ తో వస్తుంది. ఇక ఇందులో అందించిన స్పీకర్ల విషానికి వస్తే, ఇందులో 12.4mm PEEK + టైటానియం డ్రైవర్స్ కలిగి ఉంటుంది. ఈ నోయిస్ బడ్స్ అడాప్టివ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: Vivo V50 Price Leaked: లాంచ్ కంటే ముందే లీకైన వివో వి50 ప్రైస్ వివరాలు.!

ఈ బడ్స్ డ్యూయల్ డివైజ్ పైరింగ్ మరియు ఇన్ ఇయర్ డిటెక్షన్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ 6 మైక్ ENC సపోర్ట్ తో వస్తుంది మరియు క్రిస్టల్ క్లారిటీ కాలింగ్ అందిస్తుందని నోయిస్ చెబుతోంది. ఈ బడ్స్ Noise Audio App సపోర్ట్ తో వస్తుందిట మరియు బడ్స్ పై మరింత కంట్రోల్ అందిస్తుంది. ఈ బడ్స్ టోటల్ 44 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఇది ఇన్స్టాంట్ ఛార్జ్ మరియు లో లెటెన్సీ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo