50 గంటల ప్లే బ్యాక్ తో వచ్చిన కొత్త నోయిస్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్.!

50 గంటల ప్లే బ్యాక్ తో వచ్చిన కొత్త నోయిస్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్.!
HIGHLIGHTS

భారతీయ మార్కెట్ లో నోయిస్ కొత్త హెడ్ ఫోన్లను విడుదల చేసింది

ఈ కొత్త వైర్ లెస్ హెడ్ ఫోన్లను 50 గంటల ప్లే బ్యాక్ సామర్ధ్యంతో తీసుకొచ్చింది

ఈ నోయిస్ టూ వైర్ లెస్ హెడ్ ఫోన్ ను BT 5.3 వెర్షన్ తో అందించింది

భారతీయ మార్కెట్ లో నోయిస్ కొత్త హెడ్ ఫోన్లను విడుదల చేసింది. ఈ కొత్త వైర్ లెస్ హెడ్ ఫోన్లను 50 గంటల ప్లే బ్యాక్ సామర్ధ్యంతో  తీసుకొచ్చింది. ఎక్కువ కాలం మీకు మ్యూజిక్ ఆనందాన్ని అందించగల సత్తాకలిగిన ఈ వైర్‌ లెస్ హెడ్‌ ఫోన్‌ లను 'Noise Two' పేరుతో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది.  అంతరాయం లేని కనెక్టివిటీ కోసం ఈ నోయిస్ టూ వైర్ లెస్ హెడ్ ఫోన్ ను BT 5.3 వెర్షన్ తో అందించింది. మరి ఈ నోయిస్ హెడ్ ఫోన్ యొక్క వివరాలు ఉన్నాయో తెలుసుకుందామా.

Noise Two: ధర

నోయిస్ టూ వైర్ లెస్ బ్లూ టూత్ హెడ్ ఫోన్ ను కంపెనీ రూ.1,499 రూపాయల ధరలో లాంచ్ చేసింది. ఈ హెడ్ ఫోన్ బోల్డ్ బ్లాక్, కామ్ వైట్ మరియు సెరేన్ బ్లూ మూడు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ హెడ్ ఫోన్ కంపెనీ అధికారిక సైట్ మరియు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ లలో కూడా లభిస్తున్నాయి. Buy From Here

Noise Two: ఫీచర్స్

ఇక ఈ నోయిస్ టూ వైర్ లెస్ బ్లూ టూత్ హెడ్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది డ్యూయల్ పెయిరింగ్‌తో వస్తుంది మరియు సీమ్ లెస్ కనక్టిటీ కోసం బ్లూటూత్ 5.3 వెర్షన్ తో గొప్ప కనెక్టివిటీ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ హెడ్ ఫోన్ బ్లూటూత్, AUX, SD కార్డ్ మరియు FM తో సహా నాలుగు ప్లే మోడ్‌లు కలిగి వుంది. అలాగే, IPX5 వాటర్ రెసిస్టెన్స్‌ తో దుమ్ము మరియు నీటి నుండి రక్షణను కూడా కలిగివుంది. ఈ హెడ్ ఫోన్ True Bass TM గొప్ప బాస్ అనుభూతిని అందిస్తుంది మరియు 40mm స్పీకర్లతో రిచ్ బాస్ అందిస్తుందని నోయిస్ పేర్కొంది. హెడ్ ఫోన్ లో అంతర్నిర్మితంగా అందించిన మైక్ ద్వారా కాలింగ్ సౌలబ్యాన్ని కూడా పొందుతారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo