Bose Sound సహకారంతో Noise కొత్త మాస్టర్ సిరీస్ పరిచయం చేస్తోంది.!

Bose Sound సహకారంతో Noise కొత్త మాస్టర్ సిరీస్ పరిచయం చేస్తోంది
ఈ విషయాన్ని నోయిస్ అధికారికంగా ప్రకటించింది
Coming Soon ట్యాగ్ తో ఈ అప్ కమింగ్ ప్రోడక్ట్ గురించి టీజింగ్ స్టార్ట్ చేసింది
Bose Sound సహకారంతో ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Noise కొత్త మాస్టర్ సిరీస్ పరిచయం చేస్తోంది. ఈ విషయాన్ని నోయిస్ అధికారికంగా ప్రకటించింది మరియు Coming Soon ట్యాగ్ తో ఈ అప్ కమింగ్ ప్రోడక్ట్ గురించి టీజింగ్ స్టార్ట్ చేసింది. కంపెనీ యొక్క అధికారిక సైట్ మరియు అమెజాన్ ఇండియా ప్లాట్ ఫామ్ నుంచి ఈ విషయాన్ని ప్రకటించింది.
Noise Master Series
నోయిస్ గత వారం Airwave Max 5 హెడ్ ఫోన్ ను విడుదల చేసింది. 50dB అడాప్టివ్ హైబ్రిడ్ ANC మరియు 80 గంటల గొప్ప ప్లే టైమ్ ఈ హెడ్ ఫోన్ లాంచ్ చేసిన నోయిస్ వెను వెంటనే అప్ కమింగ్ సిరీస్ ను కూడా అనౌన్స్ చేసింది. నోయిస్ మాస్టర్ సిరీస్ పేరుతో ఈ అప్ కమింగ్ సిరీస్ ను గురించి టీజింగ్ చేస్తోంది. అయితే, ఇమేజ్ ను చూస్తుంటే నోయిస్ కొత్త హెడ్ ఫోన్ సిరీస్ లేదా ఇయర్ బడ్స్ సిరీస్ ను లాంచ్ చేసే అవకాశం ఉందని అనిపిస్తోంది.
Also Read: Airtel Plan: తక్కువ ఖర్చుతో 365 రోజులు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ తెచ్చిన ఎయిర్టెల్.!
ఏమిటి ఈ నోయిస్ మాస్టర్ సిరీస్ ప్రత్యేకత?
నోయిస్ అప్ కమింగ్ సిరీస్ ను Sound By Bose సౌండ్ సపోర్ట్ తో అందిస్తుంది. అంటే, Bose సౌండ్ టెక్నలాజి సహకారంతో ఈ సిరీస్ ను లాంచ్ చేస్తుంది. ఈ విషయాన్ని నోయిస్ స్వయంగా ప్రకటించింది మరియు ఈ అప్ కమింగ్ ప్రోడక్ట్ టీజర్ ఇమేజ్ తో టీజింగ్ కూడా చేస్తోంది. ఈ టీజర్ ఇమేజ్ లో పెద్ద రౌండ్ నాబ్ మరియు సైడ్ లో ఉన్న లైట్ కనిపిస్తోంది.
ఇప్పటికే ఆకట్టుకునే ఫీచర్స్ తో కొత్త ఆడియో ప్రొడక్ట్స్ పరిచయం చేసిన నోయిస్, బోస్ సహకారంతో కొత్త ఆడియో ప్రొడక్ట్స్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించి మరో అడుగు ముందుకు వేసింది. ఈ అప్ కమింగ్ ప్రోడక్ట్ లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించ లేదు. కానీ, అతి త్వరలోనే ఈ ప్రోడక్ట్ ను పరిచయం చేస్తుందని మాత్రం కన్ఫర్మ్ చేసింది.