Noise Air buds Pro 6 ఇయర్ బడ్స్ ను డ్యూయల్ స్పీకర్ మరియు LHDC తో లాంచ్ చేస్తోంది.!

Noise Air buds Pro 6 ఇయర్ బడ్స్ ను డ్యూయల్ స్పీకర్ మరియు LHDC తో లాంచ్ చేస్తోంది.!
HIGHLIGHTS

Noise Air buds Pro 6 ఇయర్ బడ్స్ లాంచ్ చేస్తున్నట్లు నోయిస్ అనౌన్స్ చేసింది

ఈ అప్ కమింగ్ బడ్స్ ను డ్యూయల్ స్పీకర్లు మరియు LHDC సపోర్ట్ తో అందిస్తోంది

49dB హైబ్రిడ్ ANC సపోర్ట్ తో క్రిస్టల్ క్లియర్ నోయిస్ క్యాన్సిలేషన్ అందిస్తుంది

Noise Air buds Pro 6 ఇయర్ బడ్స్ ను వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ చేస్తున్నట్లు నోయిస్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను ప్రస్తుతం యూజర్లు కోరుకుంటున్న విధంగా డ్యూయల్ స్పీకర్లు మరియు LHDC సపోర్ట్ తో అందిస్తోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ ఆకట్టుకునే డిజైన్ మరియు మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ గురించే మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది.

Noise Air buds Pro 6 : లాంచ్

నోయిస్ ఈ అప్ కమింగ్ బడ్స్ ను ఏప్రిల్ 3వ తేదీన లాంచ్ చేస్తున్నట్లు నోయిస్ ప్రకటించింది. ఈ బడ్స్ నోయిస్ వెబ్సైట్ మరియు అమెజాన్ ఇండియా నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Noise Air buds Pro 6 : ఫీచర్స్

నోయిస్ ఈ అప్ కేమయింగ్ ఇయర్ బడ్స్ ను ఆకట్టుకునే మంచి డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు చెబుతోంది. ఈ బడ్స్ ను పోకెట్ ఫ్రెండ్లీ డిజైన్ తో అందించింది. నోయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6 ఇయర్ బడ్స్ ను డ్యూయల్ స్పీకర్ సెటప్ తో లాంచ్ చేస్తోంది. ఇందులో 12.4 టైటానియం స్పీకర్ + పీక్ డ్రైవర్ ఉంటాయి. ఈ సెటప్ తో ఈ బడ్స్ పవర్ ఫుల్ బాస్ మరియు ప్యూర్ బ్లిస్ సౌండ్ అందిస్తుందని నోయిస్ పేర్కొంది.

Noise Air buds Pro 6

ఇక ఈ బడ్స్ కలిగిన ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ హై డెఫినేషన్ సౌండ్ అందించే LHDC ఫీచర్ కలిగి ఉంటుంది. ఇది 24bit / 96Khz హై క్వాలిటీ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, 49dB హైబ్రిడ్ ANC సపోర్ట్ తో క్రిస్టల్ క్లియర్ నోయిస్ క్యాన్సిలేషన్ అందిస్తుంది. అంటే, బయట నుంచి వచ్చే సౌండ్స్ ను పూర్తిగా నిలిపి వేస్తుంది. ఈ బడ్స్ Spatial Audio ఫీచర్, ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ మరియు డ్యూయల్ డివైజ్ పెయిరింగ్ ఫీచర్ కూడా ఉంది.

Also Read: CMF Phone 2: నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న నథింగ్ సబ్ బ్రాండ్ ఫోన్ లీక్స్.!

నోయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6 ఇయర్ బడ్స్ బ్లూటూత్ 5.3, IPX5 వాటర్ రెసిస్టెంట్ మరియు హైపర్ షింక్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ ఇన్స్టా ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 50 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఈ బడ్స్ 50ms లో లెటెన్సీ తో ఉంటుంది మరియు మెటల్ పెయింట్ ఫినిష్ తో వస్తుంది. ఈ బడ్స్ ను స్లేట్ బ్లాక్, నింబస్ గ్రే మరియు పెటల్ పింక్ మూడు కలర్ లలో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo