Noise 4 headphone: నోయిస్ బ్రాండ్ నుండి కొత్త హెడ్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ కొత్త హెడ్ ఫోన్ ను బ్లూటూత్ 5.4 సపోర్ట్, పెద్ద 70 గంటల ప్లేబ్యాక్ మరియు పెద్ద 40mm స్పీకర్ లతో నోయిస్ లాంచ్ చేసింది. నోయిస్ కొత్తగా విడుదల చేసిన NoiseFit Javelin నీరజ్ చోప్రా స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ వాచ్ తో పాటు ఈ కొత్త హెడ్ ఫోన్ ను కూడా విడుదల చేసింది.
నోయిస్ ఈ కొత్త నోయిస్ 4 హెడ్ ఫోన్ ను రూ. 2,499 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ బడ్స్ ను నోయిస్ అధికారిక సైట్ gonoise.com మరియు Amazon నుండి సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ హెడ్ ఫోన్ కామ్ బీజ్ మరియు కార్బన్ బ్లాక్ రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. Buy From Here
Also Read: Realme 13 Pro Series: DSLR కంటే సూపర్ క్లారిటీ ఫోటోలు ఇచ్చే కెమెరాలతో తెస్తోందట.!
నోయిస్ 4 హెడ్ ఫోన్ పెద్ద 70 గంటల ప్లేబ్యాక్ అందించగల పెద్ద బ్యాటరీ సపోర్ట్ తో అందించింది. ఈ హెడ్ ఫోన్ లను మంచి కనెక్టివిటీ అందించే లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.4 తో అందించింది. ఇది ఈ హెడ్ ఫోన్ కు అంతరాయం లేని కనెక్టివిటీని చేకూర్చుతుంది. అంతేకాదు, ఇది డ్యూయల్ డివైజ్ పెయిరింగ్ ఫీచర్ తో వస్తుంది. అంటే, ఈ హెడ్ ఫోన్ ను ఫోన్ మరియు ల్యాప్ టాప్ తో కనెక్ట్ చేసుకొని కావలసినప్పుడు రెండింటి మధ్య స్విచ్ చేసుకోవచ్చు.
ఇక ఈ హెడ్ ఫోన్ స్పీకర్ విషయానికి వస్తే, ఇందులో 40mm స్పీకర్స్ ఉన్నాయి. ఈ స్పీకర్స్ మంచి BASS మరియు క్లారిటీ సౌండ్ ను అందిస్తాయని నోయిస్ తెలిపింది. ఈ నోయిస్ 4 హెడ్ ఫోన్ ఇన్స్టా ఛార్జ్ టెక్ తో 10 నిమిషాల్లో 300 మినిట్స్ ప్లే టైమ్ ని అందిస్తుందని కూడా నోయిస్ తెలిపింది. ఈ హెడ్ ఫోన్ ENC మరియు 40ms అల్ట్రా లో లెటెన్సీ ఫీచర్లు కూడా కలిగి వుంది. అంతేకాదు, నోయిస్ 4 హెడ్ ఫోన్ IPX5 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా వస్తుంది.