Ptron నుండి కొత్త బాస్ బడ్స్ మార్కెట్లోకి వచ్చాయి. అమెజాన్ స్పెషల్స్ గా తీసుకొచ్చిన ఈ Ptron బాస్ బడ్స్ గరిష్టంగా 32 గంటల ప్లే బ్యాక్ అందిస్తుంది. ఈ బాస్ బడ్స్ యొక్క మొదటి సేల్ రేపటి నుండి మొదలవుతుంది. ఈ Ptron బాస్ బడ్స్ ని రూ.2999 రూపాయల MRP ధరతో ఉండగా స్పెషల్ లాంచ్ ప్రైస్ క్రింద కేవలం రూ.999 ధరకే ప్రకటించింది.
ఇక ఈ Ptron బాస్ బడ్స్ ప్రత్యేకతల విషయాన్ని వస్తే, ఈ Ptron బాస్ బడ్స్ డ్యూయల్ లాక్ స్పోర్ట్ మోడ్ తో వస్తుంది. కాబట్టి, మంచి గ్రిప్ మీ చెవులకు ఇస్తుంది మరియు చెవులకు అంటిపెట్టుకొని వుంటుంది. ఇది IPX4 సర్టిఫికేషన్ తో చెమట మరియు వాటర్ ప్రూఫ్ తో వస్తుంది. ఇక బాస్ ప్రియులకైతే ఈ Ptron బాస్ బడ్స్ తో పండగే. ఎందుకంటే, ఇది 10MM డ్రైవర్స్ తో మంచి పవర్ ఫుల్ బాస్ సౌండ్ ను అందిస్తుంది.
కనెక్టివిటీ పరంగా, ఈ Ptron బాస్ బడ్స్ బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో వస్తుంది. ఛార్జింగ్ కోసం వేగంగా పనిచేయగల టైప్-C పోర్ట్ ను కలిగి వుంటుంది. ఇది గూగుల్ మరియు సిరి వాయిస్ అసిస్టెంట్ తో స్మార్ట్ గా వుంటుంది.