Motorola Tech3 TriX: ప్రపంచంలో మొట్టమొదటి 3-ఇన్-1 స్మార్ట్ ఇయర్ ఫోన్
ట్రూ వైర్‌లెస్, నేక్ బ్యాండ్ మరియు సాధారణ వైర్డ్ ఇయర్ ఫోన్ మాదిరిగా వాడుకోవచ్చు.
3-ఇన్-1 స్మార్ట్ ఇయర్ ఫోన్ Motorola Tech3 TriX.
ఈ విధమైన ప్రత్యేకతతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఇయర్ ఫోన్ ఇదే అవుతుంది.
Motorola Tech3 TriX, ట్రూ వైర్‌లెస్, నేక్ బ్యాండ్ మరియు సాధారణ వైర్డ్ ఇయర్ ఫోన్ మాదిరిగా వాడుకునే వీలున్నఈ 3-ఇన్-1 స్మార్ట్ ఇయర్ ఫోన్ Motorola Tech3 TriX. ఇది ఇప్పటి వరకూ మనం చూస్తున్న సాంప్రదాయ ఇయర్‌ఫోన్ రూపును మారుస్తుంది మరియు సంగీతాన్ని వినే విధానంలో విప్లవాత్మక మార్పులను ఇస్తుంది. ఈ విధమైన ప్రత్యేకతతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఇయర్ ఫోన్ ఇదే అవుతుంది. TriX యొక్క అనుకూల సాంకేతికత ఫ్లెక్సిబిలిటీ మరియు ఫ్రీడమ్ ను అందించే అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తుందని, మోటరోలా తెలిపింది.
Motorola Tech3 TriX: ఫీచర్లు
ఈ మోటో స్మార్ట్ ఇయర్ ఫోన్, ట్రూ వైర్‌లెస్ మోడ్ నాణ్యతతో రాజీ పడకుండా నిజమైన వైర్‌లెస్ బడ్స్ కి స్వేచ్ఛను తెస్తుంది. ఈ హెడ్‌ఫోన్‌లు పొడవైన వైర్‌లెస్ రేంజ్ కోసం సరికొత్త బ్లూటూత్ 5.0 స్టాండర్డ్, మార్కెట్లో ప్రధానమైన HD sound మరియు ఛార్జింగ్ కేసుతో మొత్తంగా 18 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
అయితే, హెడ్‌ఫోన్స్ బ్యాటరీ లైఫ్ స్థాయితో సంబంధం లేకుండా, మీరు ట్రిక్స్ డైరెక్ట్ ప్లగ్-ఇన్ సిస్టమ్‌తో నేరుగా మీకు నచ్చినంత కాలం డైరెక్ట్ ప్లగ్-ఇన్ మోడ్ తో బడ్స్ ఉపయోగించవచ్చు. అంటే, మన సాధారణ వైర్డ్ హెడ్స్ మాదిరిగానే ఉపయోగించుకోవచ్చు. ఈ అదనపు కేబుల్ స్పోర్ట్ లూప్‌కు అయస్కాంత డాక్‌తో అనుసంధానిస్తుంది. మీరు నేరుగా ఆడియో డివైజెస్, మొబైల్స్, టాబ్లెట్‌లు మరియు మరిన్ని పరికరాలకు కనెక్ట్ అవ్వడానికి వీలుంటుంది. అధనంగా, ఈ హెడ్‌ఫోన్ ను నేక్ బ్యాండ్ మాదిరిగా కూడా ఉపయోగించుకోవచ్చు.
Motorola Tech3 TriX:ధర
ట్రూ వైర్‌లెస్, నేక్ బ్యాండ్ మరియు సాధారణ వైర్డ్ ఇయర్ ఫోన్ మాదిరిగా వాడుకునే వీలున్నఈ 3-ఇన్-1 స్మార్ట్ ఇయర్ ఫోన్ Motorola Tech3 TriX ధరను Rs. 9,999 గా ప్రకటించింది. అయితే, Flipkart Big Billion Days Sale నుండి లాంచింగ్ అఫర్ క్రింద కేవలం రూ.5,999 రూపాయల ధరకే అమ్మనునట్లు మోటో ప్రకటించింది.