మోటోరోలా సంస్థ ఇండియూలో Motorola AmphisoundX series పేరుతొ మూడు సౌండ్ సిస్టమ్ లను ప్రకటించింది. అయితే, వాటిలో Motorola AmphisoundX 80W సౌండ్ బార్ మాత్రం బడ్జెట్ ధరలో ఒక ఎంచి సౌండ్ బార్ కోసం చూస్తున్న వారికీ సరిగా సరిపోతుంది. అంతేకాదు, ఇది Bluetooth 5 కి మద్దతు ఇస్తుంది మరియు వైర్లెస్ సబ్ వూఫర్‌తో సౌండ్‌బార్ డిజైన్‌ను కలిగి ఉండడమే కాకుండా, 5.1 శాటిలైట్ స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది. అంటే, కేవలం ఎటువంటి వైర్ లేకుండా 5.1 సినిమా సరౌండ్ సౌండ్ మీకు అందుతుంది.
ఈ Motorola AmphisoundX 80W సౌండ్‌బార్ హోమ్ థియేటర్ ను కేవలం రూ. 7,999 రూపాయల ధరలో ప్రకటించింది. అయితే, దీని ప్రత్యేకతల వివరాలను చూస్తే మాత్రం ఈ ధర సమంజసమే అనిపిస్తుంది. ఈ ధరలో మీకు శాటిలైట్ స్పీకర్లు మరియు వైర్లెస్ సబ్ ఊఫర్ తో వస్తుంది. అంటే, ఎటువంటి వైర్ సహాయం లేకుండానే సినిమా థియేటర్ సౌండ్ తో సినిమాలను ఆస్వాదించవచ్చు.
పేరు సూచించినట్లుగా, మోటరోలా యాంఫిసౌండ్ఎక్స్ 80W, ఒక 80W యొక్క సౌండ్ అవుట్పుట్ కలిగి ఉంది. బాక్స్ లో, వినియోగదారులకు 1 సౌండ్‌బార్, సబ్ వూఫర్, ఆక్స్ కేబుల్, రిమోట్ కంట్రోల్, ఎఫ్‌ఎం కేబుల్, యూజర్ మాన్యువల్, 2 శాటిలైట్ స్పీకర్లు లభిస్తాయి. ఇది 5.1 సెటప్ మరియు వైర్లెస్ సబ్ వూఫర్ తో వస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది. బ్లూటూత్‌తో పాటు, సిస్టమ్ HDMI ARC, ఆప్టికల్, USB, మైక్రో SD కార్డ్ సపోర్ట్ మరియు ఆక్స్ ఇన్‌పుట్‌కు కూడా మద్దతు ఇస్తుంది. సిస్టమ్‌తో వచ్చే సబ్ వూఫర్‌లో 5.25 అంగుళాల వూఫర్ ఉంటుంది. వినియోగదారులు సిస్టమ్ యొక్క బాస్ మరియు ట్రెబెల్ను సర్దుబాటు చేయవచ్చు. సౌండ్‌బార్‌లో మూడు 10W ట్వీటర్లు ఉన్నాయి మరియు ప్రతి శాటిలైట్ స్పీకర్‌కు ఒక 10W ట్వీటర్ ఉంటుంది. సౌండ్‌బార్‌లో మూడు 2.25-అంగుళాల స్పీకర్లు మరియు ప్రతి శాటిలైట్ స్పీకర్‌కు 3-ఊఫర్ ఉంటుంది.