BOSE సౌండ్ సపోర్ట్ తో Moto Buds+ తీసుకు వస్తున్న మోటోరోలా.!

Updated on 02-May-2024
HIGHLIGHTS

మోటోరోలా ఇండియాలో కొత్త ప్రోడక్ట్ లాంఛ్ గురించి అనౌన్స్ చేసింది

Moto Buds సిరీస్ నుంచి రెండు సెట్లు రిలీజ్ చేస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది

అప్ కమింగ్ బడ్స్ ను BOSE సౌండ్ సపోర్ట్ తో తీసుకొస్తున్నట్లు తెలిపింది

మోటోరోలా ఇండియాలో కొత్త ప్రోడక్ట్ లాంఛ్ గురించి అనౌన్స్ చేసింది. అదే, Moto Buds TWS బడ్స్ మరియు ఈ సిరీస్ నుంచి రెండు సెట్లు రిలీజ్ చేస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. అయితే, లాంఛ్ అవ్వడానికి ముందే ఈ బడ్స్ ఇప్పుడు ట్రెండ్ సెట్ చేయడం మొదలు పెట్టాయి. అందుకు తగిన కారణం కూడా ఉందనుకోండి. దశాబ్దాలుగా ఆడియో రంగంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన BOSE బ్రాండ్ యొక్క సహకారంతో ఈ బడ్స్ ను సౌండ్ ఆఫ్ పర్ఫెక్షన్ గా తీసుకొస్తున్నట్లు, తెలపడం ఇందుకు ప్రధాన కారణం.

Moto Buds+ Sound by BOSE

మోటోరోలా అప్ కమింగ్ బడ్స్ ను బోస్ సౌండ్ సపోర్ట్ తో తీసుకొస్తున్నట్లు టీజింగ్ ద్వారా తెలిపింది. మోటోరోలా ఈ బడ్స్ కోసం సేల్ పార్ట్నర్ గా Flipkart ను ఎంచుకున్నట్లు కనబడుతోంది. అందుకే, కాబోలు ఈ బడ్స్ లాంచ్ కోసం ఇప్పటి నుండే ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా ఫ్లిప్ కార్ట్ టీజింగ్ మొదలు పెట్టింది. ఈ మోటో బడ్స్ సిరీస్ ను మే 9 వ తేదీ ఇండియా మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ డేట్ ఫిక్స్ చేసింది.

Moto Buds+ Sound by BOSE

ఈ మోటో బడ్స్ సిరీస్ నుంచి మోటో బడ్స్ మరియు బడ్స్+ రెండు బడ్స్ ను లాంఛ్ చేస్తోంది. ఇందులో మోటో బడ్స్ ను ‘Sound of Youth’ మరియు మోటో బడ్స్+ ను ‘Sound of Perfection’ క్యాప్షన్ తో పరిచయం చేస్తోంది.

Also Read: Amazon Great Summer Sale 2024 టాప్ బెస్ట్ Dolby సౌండ్ బార్ డీల్స్ ఇవిగో.!

Moto Buds+: ప్రత్యేకతలు

మోటోరోలా ప్రస్తుతానికి ఈ బడ్స్ యొక్క సూచన ప్రాయంగా ప్రత్యేకతలను మాత్రమే బయటపెట్టింది. ఈ బడ్స్ డ్యూయల్ డైనమిక్ డ్రైవర్స్ మరియు బోస్ సౌండ్ సపోర్ట్ తో Deep BASS మరియు Clear Vocals అందిస్తాయని తెలిపింది. అంతేకాదు, ఈ సెగ్మెంట్ లో బోస్ సౌండ్ తో వచ్చే మొదటి ఇయర్ బడ్స్ ఇవే అవుతాయని కూడా మోటో చెబుతోంది.

ఇక బడ్స్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా ఈ బడ్స్ లో వైర్లెస్ Hi Res Audio సపోర్ట్ తో వస్తుందని కూడా అర్ధం అవుతోంది. బోస్ సౌండ్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కాబట్టి, ఈ బడ్స్ అందించే సౌండ్ ఎలా ఉంటుందో చూడాలని ఆత్రుత పడే వారు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :