బడ్జెట్‌లో కొత్త సౌండ్‌బార్ హోమ్ థియేటర్ సిస్టమ్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్. ఇండియాలో మోటోరోలా సంస్థ ప్రారంభించిన Motorola AmphisoundX series ప్రత్యేకతలు మరియు ధర చూస్తుంటే, మీకు ఒక మంచి అప్షన్ కావచ్చు. ఈ సిరీస్ నుండి వేర్వేరు ప్రత్యేకతలతో మూడు వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి – 80W, 150W, 160W. ఈ మూడింటినీ బ్లూటూత్ కనెక్టివిటీతో తీసుకొచ్చింది. Motorola AmphisoundX 80W మరియు మోటరోలా యాంఫిసౌండ్ఎక్స్ 150W రెండూ కూడా Bluetooth 5 కి మద్దతు ఇస్తుండగా, మోటరోలా యాంఫిసౌండ్ఎక్స్ 160W బ్లూటూత్ 4.2 కి మద్దతు ఇస్తుంది. ఈ రెండు సిస్టమ్స్ కూడా వైర్‌లెస్ సబ్ వూఫర్‌తో సౌండ్‌బార్ డిజైన్‌ను కలిగి ఉండగా, వాటిలో ఒకటి 5.1 శాటిలైట్ స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది. కాబట్టి ఈ సిస్టమ్స్ గురించి వివరంగా పరిశీలిద్దాం.
పేరు సూచించినట్లుగా, మోటరోలా యాంఫిసౌండ్ఎక్స్ 80W, ఒక 80W యొక్క సౌండ్ అవుట్పుట్ కలిగి ఉంది. బాక్స్ లో, వినియోగదారులకు 1 సౌండ్‌బార్, సబ్ వూఫర్, ఆక్స్ కేబుల్, రిమోట్ కంట్రోల్, ఎఫ్‌ఎం కేబుల్, యూజర్ మాన్యువల్, 2 శాటిలైట్ స్పీకర్లు లభిస్తాయి. ఇది 5.1 సెటప్ మరియు వైర్‌లెస్ సబ్ వూఫర్ తో వస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది. బ్లూటూత్‌తో పాటు, సిస్టమ్ HDMI ARC, ఆప్టికల్, USB, మైక్రో SD కార్డ్ సపోర్ట్ మరియు ఆక్స్ ఇన్‌పుట్‌కు కూడా మద్దతు ఇస్తుంది. సిస్టమ్‌తో వచ్చే సబ్ వూఫర్‌లో 5.25 అంగుళాల వూఫర్ ఉంటుంది. వినియోగదారులు సిస్టమ్ యొక్క బాస్ మరియు ట్రెబెల్ను సర్దుబాటు చేయవచ్చు. సౌండ్‌బార్‌లో మూడు 10W ట్వీటర్లు ఉన్నాయి మరియు ప్రతి శాటిలైట్ స్పీకర్‌కు ఒక 10W ట్వీటర్ ఉంటుంది. సౌండ్‌బార్‌లో మూడు 2.25-అంగుళాల స్పీకర్లు మరియు ప్రతి శాటిలైట్ స్పీకర్‌కు 3-ఊఫర్ ఉంటుంది.
మోటరోలా యాంఫిసౌండ్ఎక్స్ 160 డబ్ల్యూ కూడా సౌండ్‌బార్ సిస్టమ్ అయితే 80 డబ్ల్యూ సిస్టమ్‌తో వచ్చే సరౌండ్ శాటిలైట్ స్పీకర్ లేదు. ఇది 160W సౌండ్ అవుట్పుట్ కలిగి ఉంది మరియు బ్లూటూత్ 4.2 కి మద్దతు ఇస్తుంది. బాక్స్ లో, వినియోగదారులకు 1 సౌండ్‌బార్, సబ్ వూఫర్, వాల్ మౌంట్ కిట్, రిమోట్ కంట్రోల్, ఆప్టికల్ కేబుల్, RCA టివి కేబుల్, యూజర్ మాన్యువల్, 2 పవర్ కేబుల్స్ లభిస్తాయి. ఇది 2.1 సెటప్ మరియు వైర్‌లెస్ సబ్ వూఫర్ తో వస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది. బ్లూటూత్‌తో పాటు, సిస్టమ్ HDMI ARC, ఆప్టికల్, USB మరియు Aux ఇన్‌పుట్‌కు కూడా మద్దతు ఇస్తుంది. సిస్టమ్‌తో వచ్చే సబ్ వూఫర్‌లో 6.5 అంగుళాల డ్రైవర్ ఉంటుంది. సౌండ్‌బార్‌లోనే నాలుగు 3-అంగుళాల స్పీకర్లు ఉన్నారు.
మోటరోలా యాంఫిసౌండ్ఎక్స్ 150W ఈ సిరీస్ లో మిగిలిన రెండు వేరియంట్స్ నుండి విడిగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఒక సాంప్రదాయ హోమ్ థియేటర్. ఇది సబ్ వూఫర్‌తో పాటు 5 శాటిలైట్ స్పీకర్లతో వస్తుంది. ఇది బ్లూటూత్ 5 కి మద్దతు ఇస్తుంది. బ్లూటూత్‌తో పాటు, సిస్టమ్ HDMI , ఆప్టికల్ ఆడియో, యుఎస్‌బి పోర్ట్, AUX పోర్ట్‌కు కూడా మద్దతు ఇస్తుంది మరియు ఎఫ్‌ఎం రేడియోకు కూడా మద్దతు ఇస్తుంది. సబ్ వూఫర్‌లో 8 అంగుళాల డ్రైవర్, శాటిలైట్ స్పీకర్లలో 3 అంగుళాల ఊఫర్ స్పీకర్లు ఉన్నారు. వినియోగదారులు శాటిలైట్ స్పీకర్లను గోడకు వేలాడదీయవచ్చు. ఈ సబ్ వూఫర్ ఒక ఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. వినియోగదారులు డిఫాల్ట్ 5.1 ఛానెల్‌ల ఎంపికను కలిగి ఉంటారు లేదా ప్రో లాజిక్‌తో 2.1 ఛానెల్‌కు మారవచ్చు. బాక్స్ లో , వినియోగదారులకు 1 సబ్ వూఫర్, ఆక్స్ కేబుల్, రిమోట్ కంట్రోల్, ఎఫ్ఎమ్ కేబుల్, యూజర్ మాన్యువల్, 5 శాటిలైట్ స్పీకర్లు లభిస్తాయి.