Dolby Atmos Head Tracking ఫీచర్ తో లాంచ్ కాబోతున్న Moto buds ఇయర్ బడ్స్.!
మోటోరోలా ఇండియాలో కొత్త Moto buds సిరీస్ ను లాంచ్ చేస్తోంది
Dolby Atmos Head Tracking ఫీచర్ తో లాంచ్ చేస్తునట్లు కూడా ప్రకటించింది
ఈ మోటో బడ్స్ కీలకమైన ఫీచర్ లను మోటోరోలా ఇప్పటికే బయట పెట్టింది
మోటోరోలా ఇండియాలో కొత్త Moto buds సిరీస్ ను లాంచ్ చేస్తోంది. ఈ మోటో బడ్స్ సిరీస్ నుంచి మోటో బడ్స్ మరియు బడ్స్+ లను విడుదల చేస్తోంది. ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ లో ప్లస్ వేరియంట్ ను Dolby Atmos Head Tracking ఫీచర్ తో లాంచ్ చేస్తునట్లు కూడా ప్రకటించింది. ఈ బడ్స్ కోసం అందించిన టీజర్ క్యాంపైన్ నుండి ఈ వివరాలతో టీజింగ్ చేస్తోంది. ఈ బడ్స్ యొక్క ధర తప్ప, మిగిన అన్ని కీలకమైన ఫీచర్ లను మోటోరోలా ఇప్పటికే బయట పెట్టింది.
Moto buds
మే 9వ తేదీ మోటోరోలా ఈ మోటో బడ్స్ సిరీస్ ను లాంచ్ చేస్తున్నట్లు తెలియ చేసింది. ఇందులో మోటో బడ్స్ ను యూత్ కోసం యూనిక్ స్టైల్ మరియు కలర్ లతో అందిస్తున్నట్లు మరియు బడ్స్+ మాత్రం BOSE సౌండ్ టెక్నాలజీతో పాటు డాల్బీ అట్మోస్ హెడ్ ట్రాకింగ్ ఫీచర్ తో తెలిపింది. ఈ బడ్స్ యొక్క కొన్ని కీలకమైన ఫీచర్స్ ను కూడా మోటోరోలా ముందే వెల్లడించింది. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ మోటో బడ్స్ ఫీచర్లు ఇక్కడ చూడవచ్చు.
Moto buds+
మోటో బడ్స్+ ఇయర్ బడ్స్ ను పెర్ఫెక్ట్ సౌండ్ తో తీసుకొస్తున్నట్లు మోటోరోలా ప్రత్యేకంగా చెబుతోంది. ఈ బడ్స్+ ను ప్రత్యేకంగా బోస్ సౌండ్ తో అందించింది. అంతేకాదు, ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ కలిగిన ఏకైక ఇయర్ బడ్స్ ఇవే అని కూడా మోటోరోలా గొప్ప చెబుతోంది. ఇది మాత్రమే కాదు ఇందులో ‘డాల్బీ అట్మోస్ హెడ్ ట్రాకింగ్ ఫీచర్ ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది.
డాల్బీ అట్మోస్ హెడ్ ట్రాకింగ్ ఫీచర్ అనేది సాధారణ స్టీరియో సౌండ్ కాకుండా 3 డైమేషన్ లో సౌండ్ ను అందిస్తుంది. అంటే, ఫీచర్ తో వచ్చే బడ్స్ రియల్ సౌండ్ ఫీల్ ను అందిస్తాయి ని చెప్పవచ్చు.
Also Read: Last Day offers: అమెజాన్ సేల్ చివరి రోజు చవక ధరకే లభిస్తున్న Washing Machines
ఇక ఈ బడ్స్ సిరీస్ విషయానికి వస్తే, ఈ బడ్స్ లో డ్యూయల్ డైనమిక్ స్పీకర్ లు ఉన్నట్లు, వాటితో లాస్ లెస్ ఆడియో మరియు మంచి సౌండ్ అందుకోవచ్చని కూడా చెబుతోంది. ఈ బడ్స్ Hi-Res వైర్లెస్ ఆడియో సపోర్టుతో స్టూడియో క్వాలిటీ సౌండ్ అందిస్తాయని కూడా తెలిపింది.
చూడాలి ఈ బడ్స్ ఇంకా ఎటువంటి ఫీచర్లను కలిగి ఉన్నాయో మరియు ప్రైస్ ఎలా ఉంటుందో అని.