Moto Buds Series నుంచి భారీ ఫీచర్స్ తో కొత్త బడ్స్ లాంచ్ .. ప్రైస్ మరియు స్పెక్స్ తెలుసుకోండి.!
Moto Buds Series ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది
మోటో బడ్స్ బడ్జెట్ ధరలో యూత్ కి తగిన స్టైలిష్ డిజైన్ మరియు సౌండ్ లో వచ్చింది
మోటో బడ్స్+ BOSE సౌండ్ సర్టిఫికేషన్ తో పాటు పర్ఫెక్ట్ సౌండ్ కంపాటిబిలిటీ తో వచ్చింది
గత కొన్ని రోజులుగా మోటోరోలా భారీగా టీజింగ్ చేస్తున్న Moto Buds Series ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి మోటో బడ్స్ మరియు మోటో బడ్స్+ రెండు ఇయర్ బడ్స్ ను విడుదల చేసింది. ఇందులో మోటో బడ్స్ బడ్జెట్ ధరలో యూత్ కి తగిన స్టైలిష్ డిజైన్ కలర్స్ మరియు సౌండ్ లో వచ్చింది. అయితే, మోటో బడ్స్+ మాత్రం BOSE సౌండ్ సర్టిఫికేషన్ తో పాటు పర్ఫెక్ట్ సౌండ్ కంపాటిబిలిటీ కోసం కావాల్సిన అన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది.
Moto Buds Series: Price
మోటో బడ్స్ సిరీస్ నుండి వచ్చిన ఈ రెండు బడ్స్ ప్రైస్ వివరాలు ఈ క్రింద చూడవచ్చు.
మోటో బడ్స్ ధర : రూ. 4,999
మోటో బడ్స్ ప్లస్ ధర : రూ. 9,999
ఈ మోటో బడ్స్ సేల్ మే 15 వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ బడ్స్ ను Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది.
Moto Buds: ఫీచర్స్
మోటోరోలా ఈ మోటో బడ్స్ ను సౌండ్ ఆఫ్ యూత్ ట్యాగ్ తో అందించింది. ఈ బడ్స్ ను Dolby Atmos మరియు Hi-Res Audio సౌండ్ సపోర్ట్ అందించింది. అంతేకాదు, ఈ బడ్స్ ను గొప్ప BASS కోసం పెద్ద స్పీకర్ లను కూడా కలిగి ఉన్నట్లు తెలిపింది. ఈ బడ్స్ ను 12.4mm డైనమిక్ డ్రైవర్ లతో తీసుకు వచ్చింది. ఇందులో ఉన్న ట్రిపుల్ – మైక్ క్రిస్టల్ క్లియర్ కాలింగ్ అందిస్తుంది.
ఈ బడ్స్ లో కావాల్సిన విధంగా సౌండ్ ను కంట్రోల్ చేయడానికి moto buds app సపోర్ట్ కూడా వుంది. ఈ బడ్స్ స్టార్ లైట్ బ్లూ, గ్లేసియర్ బ్లూ మరియు కార్పల్ పీచ్ అనే మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో అందించింది.
Also Read: అమెజాన్ స్మార్ట్ ఫోన్ సేల్ నుండి Redmi Note 13 Pro పైన ఆఫర్లు అందుకోండి.!
Moto Buds+: ఫీచర్స్
ఈ సిరీస్ నుండి వచ్చిన ఈ మిడ్ రేంజ్ ఇయర్ బడ్స్ భారీ ఫీచర్లను కలిగి వుంది. ఈ బడ్స్ గొప్ప ఆడియో ఎక్స్ పీరియన్స్ కోసం Bose ద్వారా సర్టిఫై చేయబడ్డాయి. ఈ బడ్స్ Active Noise Cancellation and EQ tuning తో సిట్టింగ్ సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ బడ్స్ Dolby Atmos మరియు Dolby Head Tracking సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుందని మోటోరోలా తెలిపింది.
ఈ బడ్స్ ను 11mm woofer మరియు 6mm tweeter జతగా డ్యూయల్ డైనమిక్ డ్రైవర్స్ తో అందించినట్లు మోటోరోలా తెలిపింది. ఇది Hi-Res, ట్రిపుల్ మైక్రో ఫోన్ సిస్టం మరియు LHDC సపోర్ట్ లను కూడా కలిగి వుంది.
ఈ బడ్స్ అద్భుతమైన సౌండ్, క్రిస్టల్ క్లియర్ కాలింగ్ మరియు స్టూడియో క్వాలిటీ ని అందిస్తుందని మోటోరోలా గొప్పగా చెబుతోంది.