Dolby Atmos మరియు BOSE సర్టిఫికేషన్ తో వచ్చిన Moto Buds+ సేల్ ఎప్పుడంటే.!

Dolby Atmos మరియు BOSE సర్టిఫికేషన్ తో వచ్చిన Moto Buds+ సేల్ ఎప్పుడంటే.!
HIGHLIGHTS

Moto Buds+ Sale కి అందుబాటులోకి రానున్నాయి

ఈ బడ్స్ సేల్ మే 15 వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది

ఈ బడ్స్ Dolby Atmos మరియు BOSE సర్టిఫికేషన్ తో వచ్చాయి

గత వారంలో భారీ ఫీచర్స్ తో మోటోరోలా ఇండియాలో విడుదల చేసిన Moto Buds+ మొదటి సేల్ కి అందుబాటులోకి రానున్నాయి. Dolby Atmos మరియు BOSE సర్టిఫికేషన్ తో వచ్చిన ఈ బడ్స్ సేల్ మే 15 వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాదు, ఇదే సిరీస్ నుండి వచ్చిన మోటో బడ్స్ కూడా ఇదే రోజు నుండి సేల్ అవుతాయి. మొదటి రోజు ఈ బడ్స్ పైన మంచి ఆఫర్లు కూడా అందించింది.

Moto Buds+: ప్రైస్

మోటోరోలా ఈ మోటో బడ్స్ ప్లస్ ను రూ. 9,999 ధరతో విడుదల చేసింది. ఈ బడ్స్ పైన రూ. 2,000 రూపాయల వరకు లిమిటెడ్ పీరియడ్ ICICI బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ ఈ బడ్స్ స్టాక్ ఉన్నంత వరకు లభిస్తుంది.

Moto Buds+: ఫీచర్లు

మోటో బడ్స్ సిరీస్ నుండి వచ్చిన ఈ ప్లస్ బడ్స్ ప్రీమియం ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ధరలో వచ్చింది. ఈ మోటో బడ్స్ ప్లస్ ఇయర్ బడ్స్ గొప్ప ఆడియో అందిస్తాయని కంపెనీ తెలిపింది. ఎందుకంటే, ఈ బడ్స్ Bose ద్వారా సర్టిఫై చేయబడ్డాయి మరియు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ కలిగిన మొదటి బడ్స్ ఇవే అని కంపెనీ తెలిపింది.

Moto Buds+ by BOSE
Moto Buds+ by BOSE

ఈ బడ్స్ Active Noise Cancellation and EQ tuning తో గొప్ప సౌండ్ అందిస్తుందని కూడా కంపెనీ తెలిపింది. అంతేకాదు, Dolby Atmos మరియు Dolby Head Tracking సపోర్ట్ తో ఈ ఇయర్ బడ్స్ లీనమయ్యే అద్భుతమైన సౌండ్ అందించగల శక్తిని కలిగి వుంది.

Also Read: 20 వేలకే బ్రాండెడ్ బిగ్ QLED Smart Tv అందుకోండి.!

ఈ బడ్స్ ను 11mm woofer మరియు 6mm tweeter జతగా డ్యూయల్ డైనమిక్ డ్రైవర్స్ తో అందించినట్లు మోటోరోలా తెలిపింది. ఇది Hi-Res, ట్రిపుల్ మైక్రో ఫోన్ సిస్టం మరియు LHDC సపోర్ట్ లను కూడా కలిగి వుంది.

ఈ బడ్స్ అద్భుతమైన సౌండ్, క్రిస్టల్ క్లియర్ కాలింగ్ మరియు స్టూడియో క్వాలిటీ ని అందిస్తుందని మోటోరోలా గొప్పగా చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo