ప్రపంచ ప్రసిద్ధి పొందిన ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ మార్షల్, ఇండియాలో కొత్త ట్రూ వైరల్ బడ్స్ Marshall Minor IV ను విడుదల చేసింది. ఈ కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ లో 40% ప్లాస్టిక్ ఉన్నట్లు, దీనిలో 90% శాతం ప్లాస్టిక్ ను వాడి పడేసిన ప్లాస్టిక్ CD క్యాసెట్ లు, వాషింగ్ మెషిన్స్ మరియు ఎలక్ట్రిక్ సైకిల్ వంటి వాటి నుండి తీసుకున్నట్లు తెలిపింది. మార్షల్ ఆడియో ప్రొడక్ట్స్ అంటేనే మంచి సౌండ్ అందించే బ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ల మన్నన పొందిన బ్రాండ్. అటువంటి ఈ బ్రాండ్ నుండి వచ్చిన ఈ కొత్త బడ్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
మార్షల్ ఈ కొత్త మైనర్ IV ట్రూ వైర్లెస్ బడ్స్ ను రూ. 11,999 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మార్షల్ కొత్త ఇయర్ బడ్స్ కంపెనీ అధికారిక వెబ్సైట్ మరియు అమెజాన్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ ఇయర్ బడ్స్ మొదటి సేల్ జూన్ 15 వ తేదీ నుంచి మొదలవుతుంది.అయితే, ఈరోజు నుండే ఈ బడ్స్ ప్రీ ఆర్డర్స్ ను ప్రారంభించింది. Click Here To Pre-Order
Also Read: OPPO F27 Pro+ 5G: డేమేజ్ ప్రూఫ్ మరియు వాటర్ ప్రూఫ్ డిజైన్ తో వచ్చింది.!
మార్షల్ మైనర్ IV ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ను మార్షల్ సిగ్నేచర్ సౌండ్ తో అందించింది. ఈ బడ్స్ ను 12mm స్పీకర్ లు మరియు బ్యాలెన్స్డ్ సౌండ్ తో తీసుకు వచ్చింది. ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ ఎక్కువ సమయం ధరించినా కూడా కంఫర్ట్ గా ఉండేలా సుపీరియర్ కంఫర్ట్ డిజైన్ తో అందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ బడ్స్ లో నేవిగేషన్ మరియు కాలింగ్ కోసం టచ్ కంట్రోల్స్ ను కలిగి ఉంది.
ఈ మార్షల్ కొత్త ఇయర్ బడ్స్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ మరియు టైప్ C పోర్ట్ తో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా ఉంటుంది. ఈ బడ్స్ కేస్ తో కలిపి మొత్తం 30+ గంటల ప్లేటైం అందిస్తుంది మరియు చాలా తేలికైన డిజైన్ తో ఉంటుంది. మార్షల్ యాప్ ద్వారా ఈ బడ్స్ లో సౌండ్ ను యూజర్ తగిన విధంగా (కస్టమైజ్) సెట్ చేసుకునే వీలుంది. అంతేకాదు, బ్లూటూత్ మల్టీ కనెక్టివిటీ మల్టిపుల్ డివైజ్ ఫీచర్ తో ఒకేసారి మల్టిపుల్ డివైజెస్ కు కనెక్ట్ చేసుకునే వీలుంది.