Big Screen అందించే కొత్త Smart Projectors వస్తున్నాయి | Tech News
Smart Projectors ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి
Lifelong తన కొత్త ప్రొజెక్టర్లను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది
ఇప్పటికే భారత మార్కెట్లో లైఫ్ లాంగ్ బ్రాండ్ ప్రొజెక్టర్లు మంచి పేరుని తెచ్చుకున్నాయి
దేశంలో స్మార్ట్ టీవీలతో పాటుగా స్మార్ట్ ప్రొజెక్టర్స్ కూడా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. పెద్ద స్క్రీన్ తో పాటు మంచి విజువల్స్ ని అందించగల సత్తా ఉన్న స్మార్ట్ ప్రొజెక్టర్స్ యూజర్లను ఆకర్షిస్తున్నాయి. అందుకే చాలా బ్రాండ్స్ కూడా తమ ప్రొజెక్టర్లను వేగంగా విడుదల చేస్తున్నాయి. ఇదే దారిలో ప్రముఖ భారతీయ బ్రాండ్ Lifelong తన కొత్త Smart Projectors ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే భారత మార్కెట్లో లైఫ్ లాంగ్ బ్రాండ్ ప్రొజెక్టర్లు మంచి పేరుని తెచ్చుకున్నాయి.
Big Screen Projector
లైఫ్ లాంగ్ నుంచి కొత్త ప్రొజెక్టర్లను విడుదల చేయబోతున్నట్లు టీజింగ్ మొదలుపెట్టింది. ఈ ప్రొజెక్టర్ లను Flipkart ప్రత్యేకంగా తీసుకువస్తుంది. అందుకే ఫ్లిప్ కార్ట్ ఈ అప్ కమింగ్ ప్రొజెక్టర్ లను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది.
ఫ్లిప్ కార్డ్ దించిన ఈ టీజింగ్ పేజ్ ద్వారా లైఫ్ లాంగ్ లాంఛ్ చేయబోతున్న ఈ అప్ కమింగ్ ప్రొజెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుస్తోంది. లైఫ్ లాంగ్ నాలుగు కొత్త ప్రొజెక్టర్లను విడుదల చేయబోతున్నట్లు ఈ టీజింగ్ పేజ్ లో కనిపిస్తోంది.
ఈ అప్ కమింగ్ ప్రొజెక్టర్స్ ను Coming Soon ట్యాగ్ తో తీజ్ చేస్తోంది. ఈ ప్రొజెక్టర్ లను ఎప్పుడు లాంఛ్ చేస్తోందిత్వరలోనే ప్రకటిస్తుంది.
Also Read: WhatsApp యూజర్లకు పండుగ లాంటి వార్త.. స్టేటస్ టైమ్ పెంచేసింది.!
Lifelong Smart Projectors ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఫ్లిప్ కార్డ్ మైక్రో సైట్ పేజ్ లో అందించిన వివరాల ప్రకారం, ఈ లైఫ్ లాంగ్ ప్రొజెక్టర్లు 150 ఇంచ్ సైజు వరకు స్క్రీన్ అందించగలవని చెబుతోంది. అంతేకాదు, ఈ ప్రొజెక్టర్లు 4K రిజల్యూషన్ సపోర్టును కూడా కలిగి ఉంటాయని తెలిపింది.
అన్నింటికంటే ముఖ్యంగా ఈ ప్రొజెక్టర్ యొక్క డిజైన్ గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి సైజులో చాలా చిన్నగా ఉండే Portable Projectors. ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా పవర్ఫుల్ గా ఉంటాయని కంపెనీ చెబుతోంది.
ఈ ప్రొజెక్టర్ లలో ఇన్ బెల్ట్ స్పీకర్లు ఉన్నట్లు కూడా లైఫ్ లాంగ్ తెలిపింది. ఈ ప్రొజెక్టర్ లు స్మార్ట్ ఫీచర్స్ తో వస్తాయి. అంతేకాదు, టాప్ యాప్స్ తో కలిపి బిల్ట్ ఇన్ Smart App System తో ఈ ప్రొజెక్టర్లు ఉంటాయి.
ముందుగా, లైఫ్ లాంగ్ తీసుకు వచ్చిన ప్రొజెక్టర్లు కేవలం 32 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే లాంఛ్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ప్రొజెక్టర్ లు స్మార్ట్ టీవీ రేటుకే లాంఛ్ అయ్యే అవకాశం ఉంది వచ్చని అంచనా వేస్తున్నారు.