LG Dolby Atmos today available with big discount offer from flipkart sale
LG Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 6 స్పీకర్లు కలిగి గోప్ప సరౌండ్ సౌండ్ ను మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో జబర్దస్త్ BASS సౌండ్ అందిస్తుంది. ఇంటిని థియేటర్ గా మార్చే శక్తి కలిగిన ఈ LG సౌండ్ బార్ ను ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో రీజనబుల్ ధరలో ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ ను ఈరోజు ప్రస్తావిస్తున్నాను.
LG రీసెంట్ గా విడుదల చేసిన 3.1.3 ఛానల్ సౌండ్ బార్ ప్రస్తుతం చాలా ప్లాట్ ఫామ్స్ పై రూ. 34,999 రూపాయల ప్రైస్ తో సేల్ అవుతోంది మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా ఇదే ధరతో సేల్ అవుతోంది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ‘Big Bachat Sale’ ను అందించిన బ్యాంక్ ఆఫర్ తో తక్కువ ధరకు లభిస్తోంది.
అదేమిటంటే, ఈ LG సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ సేల్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు తో 12 నెలల EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 4,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అదనపు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 31,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. అంటే, ఎప్పుడు చూడనంత తక్కువ ధరకు ఈ సౌండ్ బార్ ను అందుకోవచ్చు.
Also Read: SONY Bravia 2 టీవీలపై అతి భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించిన Flipkart
ఈ ఎల్ జి సౌండ్ బార్ 3.1.3 ఛానల్ సెటప్ మరియు సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు మూడు ముందు స్పీకర్లతో మొట్ట 6 పవర్ ఫుల్ స్పీకర్లు కలిగిన బార్ మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 400W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఈ ఎల్ జి సౌండ్ బార్ Dolby Atmos మరియు DTS:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో పాటు 24bit / 96kHz హాయ్ రిజల్యూషన్ సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (e-ARC), HDMI పాస్ త్రూ సపోర్ట్, VRR / ALLM, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ సూపర్ సరౌండ్ సౌండ్ మరియు హెవీ బాస్ తో మీ ఇంటిని థియేటర్ గా మారుస్తుంది మరియు స్మార్ట్ ఫోన్ కు తగిన పార్ట్నర్ అవుతుంది.