digit zero1 awards

Sankranti Super Deal: ఎన్నడూ లేనంత చవక ధరకు లభిస్తున్న LG Dolby Atmos 3.1.2 సౌండ్ బార్.!

Sankranti Super Deal: ఎన్నడూ లేనంత చవక ధరకు లభిస్తున్న LG Dolby Atmos 3.1.2 సౌండ్ బార్.!
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ఈరోజు సూపర్ సౌండ్ బార్ డీల్ అనౌన్స్ చేసింది

LG Dolby Atmos 3.1.2 సౌండ్ బార్ ఎన్నడూ లేనంత చవక ధరకు ఆఫర్ లభిస్తోంది

LG Meridian సౌండ్ బార్ ను ఈరోజు గొప్ప డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు.

Sankranti Super Deal: ఫ్లిప్ కార్ట్ ఈరోజు సూపర్ సౌండ్ బార్ డీల్ ను అనౌన్స్ చేసింది. LG Dolby Atmos 3.1.2 సౌండ్ బార్ ఎన్నడూ లేనంత చవక ధరకు ఆఫర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2025 సంక్రాంతి రోజు ఈ డీల్ ను అనౌన్స్ చేసింది. సూపర్ సౌండ్ అందించే ఈ LG Meridian సౌండ్ బార్ ను ఈరోజు గొప్ప డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు.

Sankranti Super Deal

ఫ్లిప్ కార్ట్ రీసెంట్ గా తీసుకు వచ్చిన Monumental Sale నుంచి ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈ ధమాకా ఆఫర్ ను అందించినట్లు కనిపిస్తుంది. LG యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ LG SP8A ఈరోజు 58% అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 24,990 డిస్కౌంట్ ప్రైస్ తో లిస్ట్ అయ్యింది.

వాస్తవానికి, ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 49,999 హైయెస్ట్ ప్రైస్ తో కూడా సేల్ అయ్యింది. అయితే, ఈరోజు సేల్ నుంచి చాలా తక్కువ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ LG సౌండ్ బార్ ను కేవలం రూ. 23,490 రూపాయల ఆఫర్ ధరకి పొందవచ్చు. Check Offer Here

LG Dolby Atmos 3.1.2 Soundbar: ఫీచర్స్

ఈ LG సౌండ్ బార్ సూపర్ సౌండ్ అందించే మెరిడియన్ సౌండ్ టెక్నాలజీ మరియు Class D ఆంప్లిఫైర్ తో వస్తుంది. ఇందులో ,మూడు 40W ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు రెండు 50W అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ తో పాటు 220W పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 440W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది.

Sankranti Super Deal  LG Dolby Atmos 3.1.2 Soundbar

ఈ సౌండ్ బార్ Dolby Atmos, Dolby TrueHD, డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ డిజిటల్, DTS:X, DTS-HD మాస్టర్ ఆడియో, DTS-HD హై రిజల్యూషన్ ఆడియో, DTS డిజిటల్ సరౌండ్ , LPCM మరియు AAC సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ AI రూమ్ కాలిబ్రేషన్ సపోర్ట్ తో కూడా వస్తుంది.

Also Read: Sankranti 2025: మీ ప్రియమైన వారికి సరదాల సంక్రాంతి విషెస్ ఇలా చెప్పండి. !

ఈ సౌండ్ బార్ HDMI (eARC/ARC), క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్, బిల్ట్ ఇన్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్, బ్లూటూత్ మరియు SIMPLINK, USB మరియు ఆప్టికల్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ SPK8-S రియర్ స్పీకర్ కిట్ సపోర్ట్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo