LG 3.1.3 Dolby Atmos soundbar now available at never before price
LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ ఎప్పుడు చూడనంత చవక ధరకు లభిస్తోంది. ఈ ఆశ్చర్యకరమైన డీల్ ని అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తోంది. ఇంటికి షేక్ చేసే ఎల్ జి పవర్ ఫుల్ ట్రిపుల్ అప్ ఫైరింగ్ సౌండ్ గా పేరొందిన ఈ సౌండ్ బార్ ను ఈరోజు గొప్ప డిస్కౌంట్ ధరకు అందుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం ఈ ఎల్ జి సౌండ్ బార్ గురించి వివరంగా తెలుసుకుందాం పదండి.
ఎల్ జి 3.1.3 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ S77TY మోడల్ ఈరోజు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లో రూ. 54,990 ధరకు లాంచ్ అవ్వగా ఈరోజు అమెజాన్ నుంచి 47% భారీ డిస్కౌంట్ తో రూ. 28,990 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తోంది. నిన్న మొన్నటి వరకు కూడా ఈ సౌండ్ బార్ రూ. 31,990 రేటుకే సేల్ అయ్యింది.
కేవలం ఈ డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ ఫోన్ పై బి భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ ను అమెజాన్ నుంచి SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చెసే వారికి రూ. 4,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 24,990 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈ సౌండ్ బార్ ఎప్పుడు చూడనంత చవక ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: అండర్ రూ. 25,000 బెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv డీల్స్ కోసం చూస్తున్నారా.!
ఈ ఎల్ జి సౌండ్ బార్ 3.1.3 సెటప్ కలిగి ఉంటుంది. అంటే, ఇందులో పైన 3 అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు ముందు 3 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లతో మొత్తం 6 స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ వైర్లెస్ షబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 400W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సింపుల్ సెటప్ మరియు గొప్ప డిజైన్ తో ఆకట్టుకుంటుంది.
ఈ ఎల్ జి సౌండ్ బార్ Dolby Atmos మరియు DTS:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి థియేటర్ లాంటి సౌండ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఏఎస్ సౌండ్ బార్ ట్రిపుల్ లెవల్ స్పటియల్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఇందులో స్మార్ట్ అప్ మిక్సర్, VRR, ALLM/120Hz ఫీచర్ కూడా ఉంటుంది.
ఇంటిని థియేటర్ గా మార్చే సౌండ్ బార్ లలో ఒకటిగా ఈ సౌండ్ బార్ నిలుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఈ సౌండ్ బార్ అతి తక్కువ ధరకు లభిస్తుంది.