JBL Beam 2 మరియు Wave Buds ను డిసెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు JBL తెలిపింది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను లేటెస్ట్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేయనున్నట్లు టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ బడ్స్ కీలకమైన ఫీచర్స్ మరియు అంచనా ధర వివరాలు ఏమిటో చూద్దామా.
జెబిఎల్ డిసెంబర్ 17న ఈ బడ్స్ ను లాంచ్ చేస్తుంది. ఈ బడ్స్ ను అమెజాన్ ఇండియా ద్వారా లాంచ్ చేస్తోంది. ఈ బడ్స్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ తో టీజింగ్ చేస్తోంది. ఈ పీజీ నుంచి ఈ రెండు బడ్స్ అంచనా ధర మరియు కీలకమైన ఫీచర్స్ తో కూడా టీజింగ్ చేస్తోంది.
ఈ బడ్స్ ను ఇప్పుడు యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC)ఫీచర్ తో లాంచ్ చేస్తున్నట్లు జెబిఎల్ ప్రకటించింది. ఈ బడ్స్ ను JBL Pure Bass సౌండ్ అందించే 8mm డైనమిక్ స్పీకర్ల తో లాంచ్ చేస్తోంది. ఈ బడ్స్ మల్టీ డివైజ్ కనెక్టివిటీ మరియు ఈజీగా స్విచ్ చేసుకునేలా అందిస్తోంది.
ఈ జెబిఎల్ అప్ కమింగ్ బడ్స్ బ్లూటూత్ వెర్షన్ 5.3 తో వస్తాయి. ఈ బడ్స్ లో క్లియర్ కాల్స్ కోసం క్వాడ్ Mic సపోర్ట్ ను అందించినట్టు జెబిఎల్ తెలిపింది. ఈ బడ్స్ ను 40 గంటల ప్లే టైమ్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది. అయితే, ANC On లో ఉన్నప్పుడు 32 గంటల ప్లే టైమ్ అందిస్తుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 17 వేలకే 43 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
ఇక డిజైన్ విషయానికి వస్తే, ఈ రెండు బడ్స్ లో బీమ్ 2 ను స్టిక్ డిజైన్ తో వేవ్ బడ్స్ ను బడ్ డిజైన్ తో లాంచ్ చేస్తుంది. ఈ రెండు బడ్స్ కూడా JBL Headphone APP సపోర్ట్ తో వస్తాయి.