JBL Tune Series నుంచి మూడు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ ప్రకటించింది.!

JBL Tune Series లాంచ్ గురించి జేబీఎల్ ప్రకటించింది
లాంచ్ ప్రకటనతో పాటు ఈ బడ్స్ ఫీచర్స్ తో కూడా టీజింగ్ ప్రారంభించింది
ఈ సిరీస్ నుంచి Beam 2, ట్యూన్ Buds 2 మరియు ట్యూన్ Flex 2 మూడు ఇయర్ బడ్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది
JBL Tune Series లాంచ్ గురించి జేబీఎల్ ప్రకటించింది. ఈ అప్ కమింగ్ సిరీస్ లాంచ్ ప్రకటనతో పాటు ఈ బడ్స్ ఫీచర్స్ తో కూడా టీజింగ్ ప్రారంభించింది. ఈ సిరీస్ నుంచి జేబీఎల్ ట్యూన్ Beam 2, ట్యూన్ Buds 2 మరియు ట్యూన్ Flex 2 మూడు ఇయర్ బడ్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ బడ్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది.
JBL Tune Series : ఫీచర్స్
ఈ అప్ కమింగ్ బడ్స్ సిరీస్ లాంచ్ డేట్ ను జేబీఎల్ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ బడ్స్ ను ఇదే నెలలో లాంచ్ చేస్తుందని మాత్రం జేబీఎల్ కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ బడ్స్ పై 2 సంవత్సరాల వారంటీ ఆఫర్ చేస్తుందని కూడా జేబీఎల్ చెబుతోంది. ఈ బడ్స్ లాంచ్ గురించి అమెజాన్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ బడ్స్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది.
ఈ బడ్స్ యొక్క కీలకమైన ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ బడ్స్ స్మార్ట్ యాంబియంట్ తో కూడిన అడాప్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ ఫీచర్ తో బయట నుంచి వచ్చే రణగొణ ధ్వనులను ఆడుకొని క్లియర్ సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ లో స్పెటియల్ సౌండ్ ఫీచర్ కూడా ఉంటుంది మరియు ఈ ఫీచర్ తో లీనమయ్యే గొప్ప సౌండ్ అందిస్తుందట.
ఈ మూడు అప్ కమింగ్ ఇయర్ బడ్స్ కూడా జేబీఎల్ ప్యూర్ BASS మరియు సిగ్నేచర్ సౌండ్ అందించే డైనమిక్ డ్రైవర్స్ కలిగి ఉంటాయి. ఈ మూడు అప్ కమింగ్ బడ్స్ కూడా జేబీఎల్ హెడ్ ఫోన్స్ యాప్ కి సపోర్ట్ కలిగి ఉంటాయి. ఇందులో ANC లో యాంబియంట్, రిలాక్స్ మోడ్ మరియు వాయిస్ అవేర్ వంటి మరిన్ని మోడ్స్ ఉంటాయి.
Also Read: బ్రాండెడ్ 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్.!
ఈ అప్ కమింగ్ జేబీఎల్ బడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ 5.3, ఫాస్ట్ పెయిర్ మరియు MS షిఫ్ట్ పెయిర్ ఫీచర్స్ కాళీ`కలిగి శ్రమలేని కనెక్టివిటీకి సహకరిస్తాయి. ఇందులో మల్టీ డివైజ్ కనెక్ట్ సపోర్ట్ మరియు రెండింటి మధ్య సులభంగా మారే అవకాశం కూడా అందించింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ సిరీస్ బడ్స్ 48 గంటల వరకు ప్లే టైమ్ అందించే బ్యాటరీ సపోర్ట్ తో ఉంటాయని కూడా జేబీఎల్ పేర్కొంది.