ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ అయ్యాయి. ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా?, ఈ బడ్స్ కి విశేషం వుంది. అదేమిటంటే కేవలం రూ. 999 రూపాయలకే ANC Buds ను లాంచ్ చేసింది itel. Buds Ace పెరటి ఐటల్ లాంచ్ చేసిన ఈ బడ్స్ బడ్జెట్ ధరలో ANC సపోర్ట్ కలిగిన బడ్స్ గా నిలుస్తాయి.
ఐటెల్ ఈ బడ్స్ ను రూ. 3,999 రూపాయల MRP ధరతో మరియు లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ. 999 రూపాయల లాంచ్ ధరకు ప్రకటించింది. ఈ బడ్స్ డిసెంబర్ 20వ తేదీ నుం సి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ ను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేసింది మరియు అమెజాన్ నుంచి సేల్ అవుతాయి. మరొక విశేషం ఏమిటంటే, ఈ బడ్స్ ను ముందుగా కొనుగోలు చేసే 100 మంది కొనుగోలుదారులకు కేవలం రూ. 299 రూపాయలకే ఈ బడ్స్ ను అందిస్తుందని ఐటెల్ ప్రకటించింది.
Also Read: Realme 14x 5G: 15 వేలకే వేడి నీటిలో ముంచినా ఖరాబుకాని ఫోన్ లాంచ్ చేసిన రియల్ మీ.!
ఐటెల్ ఈ కొత్త బడ్స్ ను యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (25dB) సపోర్ట్ తో అందించింది. ఈ బడ్స్ ఈజీ టచ్ కంట్రోల్స్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటాయి. ఐటెల్ ఈ కొత్త బెడ్స్ ను టోటల్ 50 గంటల ప్లే టైం తో అందించింది. మంచి క్వాలిటీ కాలింగ్ కోసం ఈ బడ్స్ లో డ్యూయల్ Mic ENC సపోర్ట్ ను అందించినట్లు కూడా తెలిపింది.
ఈ బడ్స్ లో క్విక్ ఛార్జ్ సపోర్ట్ వుంది మరియు 1ఓ నిముషాల ఛార్జ్ తో 180 నిమిషాల ప్లే టైం అందిస్తుందని ఐటెల్ తెలిపింది. ఈ బడ్స్ ను IPX5 రేటింగ్ తో వాటర్ ప్రూఫ్ గా ఈ బడ్స్ ను అందించింది. ఈ బడ్స్ క్రేన్ బెర్రీ, వైట్ మరియు మిడ్ నైట్ బ్లూ మూడు కలర్ ఆప్షన్ లవ్ లభిస్తుంది.