కేవలం రూ. 999 రూపాయలకే ANC Buds లాంచ్ చేసిన itel.!

కేవలం రూ. 999 రూపాయలకే ANC Buds లాంచ్ చేసిన itel.!
HIGHLIGHTS

ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ అయ్యాయి

కేవలం రూ. 999 రూపాయలకే ANC Buds ను లాంచ్ చేసింది itel

ఈ బడ్స్ బడ్జెట్ ధరలో ANC సపోర్ట్ కలిగిన బడ్స్ గా నిలుస్తాయి

ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ అయ్యాయి. ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా?, ఈ బడ్స్ కి విశేషం వుంది. అదేమిటంటే కేవలం రూ. 999 రూపాయలకే ANC Buds ను లాంచ్ చేసింది itel. Buds Ace పెరటి ఐటల్ లాంచ్ చేసిన ఈ బడ్స్ బడ్జెట్ ధరలో ANC సపోర్ట్ కలిగిన బడ్స్ గా నిలుస్తాయి.

itel ANC Buds: ప్రైస్ మరియు ఆఫర్లు

ఐటెల్ ఈ బడ్స్ ను రూ. 3,999 రూపాయల MRP ధరతో మరియు లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ. 999 రూపాయల లాంచ్ ధరకు ప్రకటించింది. ఈ బడ్స్ డిసెంబర్ 20వ తేదీ నుం సి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ ను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేసింది మరియు అమెజాన్ నుంచి సేల్ అవుతాయి. మరొక విశేషం ఏమిటంటే, ఈ బడ్స్ ను ముందుగా కొనుగోలు చేసే 100 మంది కొనుగోలుదారులకు కేవలం రూ. 299 రూపాయలకే ఈ బడ్స్ ను అందిస్తుందని ఐటెల్ ప్రకటించింది.

Also Read: Realme 14x 5G: 15 వేలకే వేడి నీటిలో ముంచినా ఖరాబుకాని ఫోన్ లాంచ్ చేసిన రియల్ మీ.!

itel ANC Buds : ఫీచర్స్

ఐటెల్ ఈ కొత్త బడ్స్ ను యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (25dB) సపోర్ట్ తో అందించింది. ఈ బడ్స్ ఈజీ టచ్ కంట్రోల్స్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటాయి. ఐటెల్ ఈ కొత్త బెడ్స్ ను టోటల్ 50 గంటల ప్లే టైం తో అందించింది. మంచి క్వాలిటీ కాలింగ్ కోసం ఈ బడ్స్ లో డ్యూయల్ Mic ENC సపోర్ట్ ను అందించినట్లు కూడా తెలిపింది.

itel ANC Buds

ఈ బడ్స్ లో క్విక్ ఛార్జ్ సపోర్ట్ వుంది మరియు 1ఓ నిముషాల ఛార్జ్ తో 180 నిమిషాల ప్లే టైం అందిస్తుందని ఐటెల్ తెలిపింది. ఈ బడ్స్ ను IPX5 రేటింగ్ తో వాటర్ ప్రూఫ్ గా ఈ బడ్స్ ను అందించింది. ఈ బడ్స్ క్రేన్ బెర్రీ, వైట్ మరియు మిడ్ నైట్ బ్లూ మూడు కలర్ ఆప్షన్ లవ్ లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo