పవర్ ఫుల్ సౌండ్ అందించే రెండు కొత్త Soundbar లను లాంచ్ చేసిన Honeywell

పవర్ ఫుల్ సౌండ్ అందించే రెండు కొత్త Soundbar లను లాంచ్ చేసిన Honeywell
HIGHLIGHTS

Honeywell పవర్ ఫుల్ సౌండ్ అందించే రెండు కొత్త Soundbar లను విడుదల చేసింది

ఈ సౌండ్ బార్ Dolby Audio మరియు 3D సరౌండ్ సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది

ఈ రెండు సౌండ్ బార్స్ ధర మరియు ఫీచర్స్ ఫై ఒక లుక్కేయండి

హాంక్ కాంగ్ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Honeywell పవర్ ఫుల్ సౌండ్ అందించే రెండు కొత్త Soundbar లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇండియాలో ఇప్పటికే బడ్జెట్ సౌండ్ బార్ లను ఆఫర్ చేస్తున్న హనీవెల్ బ్రాండ్ ఇప్పుడు ప్రీమియం ఫీచర్స్ కలిగిన పవర్ ఫుల్ సౌండ్ బార్ లను ఇప్పుడు లాంచ్ చేసింది. ఈ రెండు సౌండ్ బార్స్ ధర మరియు ఫీచర్స్ ఫై ఒక లుక్కేయండి.

Honeywell Soundbar

హనీవెల్ Trueno U7000 మరియు Trueno U4000 మోడల్ నెంబర్ లతో ఈ సౌండ్ బార్ లను అందించింది. ఇందులో, Trueno U7000 సౌండ్ బార్ ను రూ. 15,999 ధరతో Trueno U4000 సౌండ్ బార్ ను రూ. 8,799 ధరతో అమెజాన్ నుంచి లిస్ట్ చేసింది.

ఆఫర్స్

ఈ సౌండ్ బార్ లను అమెజాన్ ఇండియా నుంచి Axis బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 రూపాయల అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఆఫర్స్ చెక్ చేయడానికి మరియు కొనుగోలు చేయడానికి Buy From Here పై నొక్కండి.

Honeywell Soundbar : ఫీచర్స్ (Trueno U7000)

ఈ హనీవెల్ సౌండ్ బార్ 5.1 ఛానల్ తో వస్తుంది మరియు ఒక బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 500W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో మంచి స్టేబుల్ కనెక్టివిటీ కోసం బ్లూ టూత్ 5.3 + EDR టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది.

Honeywell Trueno U7000 Soundbar

ఈ సౌండ్ బార్ లో AUX, USB, Optical Input మరియు HDMI/ARC వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంది. ఈ సౌండ్ బార్ Dolby Audio మరియు 3D సరౌండ్ టెక్నాలజీ తో గొప్ప సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

Also Read: 11 వేలకే కొత్త QLED Smart Tv కోసం చూస్తున్న వారికి ధమాకా ఆఫర్.!

Trueno U4000 : ఫీచర్స్

Honeywell Trueno U4000 Soundbar

ఈ సౌండ్ బార్ 2.1 ఛానెల్ తో వస్తుంది మరియు టోటల్ 240W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో బ్లూటూత్ 5.3, AUX,USB,Optical మరియు HDMI/ARC వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంది. ఈ సౌండ్ బార్ 3D సరౌండ్ సౌండ్ మరియు డీప్ BASS సౌండ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo