HiFuture సంస్థ, ఇప్పటివరకూ ఆడియో విభాగంలో ప్రీమియం డివైజెస్ ని ఇండియాలో విడుదల చేసినా కూడా నెమ్మదిగా తనదైన శైలిలో మంచి సౌండ్ అందిస్తున్న డివైజ్ కలిగిన బ్రాండ్ గా పుంజుకుంటోంది. ఇప్పుడు, లేటెస్ట్ గా ప్రీమియం నుండి దిగివచ్చి అందరికి అందుబాటులో ఉండేలా తన కొత్త టచ్ సెన్సార్ ఎనేబుల్ ట్రూ ఇయర్ బడ్స్ ని, ఇండియాలో HiFuture FlyBuds పేరుతొ సరసమైన ధరలో విడుదల చేసింది.
HiFuture టచ్ సెన్సార్ ఎనేబుల్ ట్రూ ఇయర్ బడ్స్ సరసమైన ధరలో వచ్చినా కూడా దీనిలో అందించిన ఫీచర్లు మాత్రం ప్రీమియం ఇయర్ బడ్స్ లో వచ్చే ఫీచర్ల మడిగానే ఉంటాయి. ఇక ఇందులో అందించిన ఫీచర్ల విషయానికి వస్తే, ఇది మీకు టచ్ సెన్సింగ్ తో వస్తుంది మరియు డైనమిక్ N42 నియోడైమియం మేగ్నెట్ డ్రైవర్స్ తో వస్తుంది. కాబట్టి, ఇది మీకు క్రిప్సీ Treble మరియు పవర్ఫుల్ BASS తో పాటుగా, రిచ్ సౌండ్ ని మీకు అందిస్తుంది. దీని తన Blootuth 5.0 కనక్టివిటీతో మంచి కనెక్టివిటీ ని కూడా అఫర్ చేస్తుంది.
మొత్తం బాక్స్ కూడా కేవలం 45 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఇక ఒక్కొక్క ఇయర్ పీస్ కేవలం 5 గ్రాముల బరువు మాత్రమే ఉంటుందంటే, ఎంత తేలికగా ఉంటుందో మీరే ఆలోచించండి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ఇది IPX5 సర్టిఫికేషన్ తో వస్తుంది. అంటే, నీరు మరియు దుమ్ము నిరోధకంగా పనిచేస్తుంది. సంస్థ తెలిపిన ప్రకారం, ఇది చెమట, వర్షం లేదా నీళ్లలో పడినా కూడా ఎటువంటి ప్రమాదం జరగని విధంగా తయారు చేసినట్లు చెబుతోంది.
ఇది ఒక్కసారి ఛార్జ్ తో 4 గంటల ప్లే బ్యాక్ ని ఇస్తుంది. ఇక పోర్టబుల్ ఛార్జింగ్ కేసు మీకు మరొక 15 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ సమయాన్ని అందిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలను కలిగిన ఈ HiFuture FlyBuds ని కేవలం రూ. 2,499 ధరతో ఇండియాలో లాంచ్ చేసింది మరియు ఈ ఇయర్ బడ్స్ ని అమేజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు.