Google Pixel Buds Pro 2 : అద్భుతమైన నోయిస్ క్యాన్సిల్ అందించే Silent Seal 2.0 తో వచ్చింది.!
Google Pixel 9 Series స్మార్ట్ ఫోన్ లతో పాటు గూగుల్ బడ్స్ ప్రో 2 ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేసింది
అద్భుతమైన నోయిస్ క్యాన్సిల్ అందించే Silent Seal 2.0 తో లాంచ్ చేసింది
ఈ కొత్త బడ్స్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా కూడా గొప్పగా ఆకట్టుకుంటోంది
Google Pixel Buds Pro 2 : నిన్న రాత్రి గూగుల్ నిర్వహించిన ‘Made By Google’ మెగా ఈవెంట్ నుంచి Google Pixel 9 Series స్మార్ట్ ఫోన్ లతో పాటు గూగుల్ బడ్స్ ప్రో 2 ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను అద్భుతమైన నోయిస్ క్యాన్సిల్ అందించే Silent Seal 2.0 తో లాంచ్ చేసింది. ఈ కొత్త బడ్స్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా కూడా గొప్పగా ఆకట్టుకుంటోంది.
Google Pixel Buds Pro 2 : ధర
గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో 2 ఇయర్ బడ్స్ ను రూ. 22,990 రూపాయల ధరలో విడుదల చేసింది. ఈ బడ్స్ ను Flipkart, టాటా Croma మరియు Reliance Digital నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్స్ పోర్స్లీన్, హాజెల్, వింటర్ గ్రీన్ మరియు పియోని నాలుగు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.
Google Pixel Buds Pro 2 : ఫీచర్స్
గూగుల్ ఈ పికెల్స్ బడ్స్ ప్రో 2 ఇయర్ బడ్స్ ను Tensor A1 చిప్ సెట్ తో అందించింది. ప్రత్యేకమైన టెన్సర్ చిప్ సెట్ తో వచ్చిన మొదటి బడ్స్ గా పికెల్స్ బడ్స్ ప్రో 2 నిలిచింది. ఈ గూగుల్ బడ్స్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన 11mm స్పీకర్ లను కలిగి ఉంటుంది. ఈ బడ్స్ Silent SealTM 2.0 జతగా ఉన్న యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ క్యాన్సిలేషన్ తో బ్యాగ్రౌండ్ సౌండ్ అనేది లేకుండా చేస్తుంది. అంతేకాదు, ఇది ట్రాన్స్పరెన్సీ మోడ్, యాక్టివ్ ఇన్ ఇయర్ ప్రెజర్ రిలీఫ్ మరియు కన్వర్జేషన్ డిటెక్షన్ ఫీచర్ లను కలిగి ఉంటుంది.
Also Read: Google 9 Series లాంచ్ ఈవెంట్ లైవ్ లో మొరాయించిన Gemini AI
గూగుల్ ఈ పికెల్స్ బడ్స్ ప్రో 2 బడ్స్ Find My Device కోసం కేసు లో రింగ్ టోన్ స్పీకర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ వాయిస్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ బడ్స్ క్లియర్ కాలింగ్, వాయిస్ యాక్సిలెరోమీటర్, విండ్ బ్లాకింగ్ మెష్ కవర్ మరియు బ్లూటూత్ సూపర్ వైడ్ బ్యాండ్ తో వస్తుంది. ఈ బడ్స్ మూడు మైక్రో ఫోన్స్, మ్యూజిక్, కాలింగ్ మరియు వాయిస్ అసిస్టెంట్ కోసం కెపాసిటివ్ టచ్ కంట్రోల్ ను కలిగి ఉంటుంది. ఈ బడ్స్ IP54 రేటింగ్ తో వస్తుంది మరియు బ్లూటూత్ 5.4 సపోర్ట్ తో ఉంటుంది. ఈ బడ్స్ LE Audio, Super Wideband లతో పాటు USB టిప్ C మరియు Qi-certified వైర్లెస్ ఛార్జ్ సప్పోర్ట్ తో కూడా వస్తుంది.