get LG Soundbar with 600W ground shaking sound with big deals
LG Soundbar: ఇంటిని షేక్ చేసే 600W హెవీ సౌండ్ అందించే LG సౌండ్ బార్ ను ఈరోజు మంచి ఆకర్షణీయమైన ధరలో అందుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో 30 వేల బడ్జెట్ ధరలో విడుదలైన ఈ సౌండ్ బార్ మంచి డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈరోజు రీజనబుల్ ప్రైస్ సెగ్మెంట్ లో లభిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ కంప్లీట్ సెటప్ తో థియేటర్ వంటి సౌండ్ ను మీ ఇంట్లోనే అందిస్తుంది.
2024 సంవత్సరంలో LG విడుదల చేసిన 600W సౌండ్ బార్ LG S65TR ఇండియన్ మార్కెట్లో రూ. 29,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ రోజు ఈ సౌండ్ బార్ అమెజాన్ అందించిన రూ. 7,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ ను అమెజాన్ నుంచి ఈరోజు Federal మరియు DBS క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ LG పవర్ ఫుల్ సౌండ్ బార్ ను కేవలం రూ. 21,499 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చు. Buy From Here
Also Read: బెస్ట్ బడ్జెట్ 55 ఇంచ్ Smart Tv ఆఫర్: 24 వేల ధరలో 55 ఇంచ్ టీవీ అందుకోండి.!
ఈ ఎల్ జి సౌండ్ బార్ 5.1 ఛానల్ సపోర్ట్ మరియు సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో, మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే జబర్దస్త్ 600W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ వైర్లెస్ సబ్ ఉఫర్ మరియు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లతో ఎటువంటి వైర్ల బెడద లేకుండా సూపర్ సెటప్ అనుభూతిని అందిస్తుంది.
ఈ ఎల్ జి సౌండ్ బార్ Dolby Digital మరియు DTS Digital Surround సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్ 5.3, HDMI Out, HDMI Arc, ఆప్టికల్ మరియు USB కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.